Vijay Deverakonda : కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ లేటెస్ట్ సీజన్ అనుకోని కారణాల వల్ల నిలిచిపోయింది. అయితే 7వ సీజన్ ప్రోమోలో ఆసక్తికరమైన క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో అన్ని ఆసక్తికరమైన బైట్‌లు ఉన్నాయి. సీజన్ 2 ప్రసారానికి ముందు.. కరణ్ జోహార్ లేటెస్ట్ ప్రోమోను రిలీజ్ చేశాడు. ఈ ప్రోమోలో ఇద్దరు అందమైన ముద్దుగుమ్మలైన జాన్వీ కపూర్ సారా అలీ ఖాన్ ఉన్నారు.

అంతేకాదు.. ‘నాకు ఇష్టమైన ఇద్దరు అమ్మాయిలు అన్‌ఫిల్టర్‌డ్ బెస్ట్‌లో!’ అంటూ కరణ్ జోహార్ ప్రోమోకు క్యాప్షన్ పెట్టాడు. ఈ సందర్భంగా ప్రోమో కట్‌లో కరణ్ జోహార్ సారాతో డేటింగ్ చేయాలనుకునే వ్యక్తి ఎవరని అడిగాడు. ‘సారా, మీరు ఈ రోజు డేటింగ్ చేసే వ్యక్తి పేరు చెప్పండి అని అడిగాడు. ఆ విషయంలో సారా సంకోచించింది. కానీ, ‘విజయ్ దేవరకొండ’ అని చెప్పేసింది.
గత సీజన్‌లో.. విజయ్ దేవరకొండపై తనకు క్రష్ ఉందని జాన్వీ కపూర్ చెప్పుకొచ్చింది. వెంటనే సారా ‘నీకు విజయ్ నచ్చాడా?’ అని అడిగింది. దీనికి సంబంధించి ప్రోమో వీడియో వైరల్ అవుతుంది. దీనిపై స్పందించిన విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ ఇద్దరిపై కామెంట్ పెట్టాడు. ‘మీరు ‘దేవరకొండ’ అని చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. క్యూటెస్ట్.. మీకు నా బిగ్ హగ్స్.. ఇదిగో నా ప్రేమను పంపుతున్నాను.’ చివర్లో రెడ్ హార్ట్ ఎమోజీని కూడా దేవరకొండ జోడించాడు. కాఫీ విత్ కరణ్ 7 రెండవ ఎపిసోడ్ జూలై 14న ప్రసారం కానుంది.
Read Also : Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పై అభిమానంతో వీపుపై టాటూ వేయించుకున్న అమ్మాయి..?