Vijay Devarakonda : లైగర్ బాయ్.. విజయ్ దేవరకొండ.. హీరోయిన్ ఒడిలో తలపెట్టిన నిద్రించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ముందే విజయ్ దేవరకొండ భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకుని మరి ప్రమోషన్స్ చేస్తున్నాడు. లైగర్ సినిమాను ఎంతగా ప్రమోషన్ చేయాలో అంతగా హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగంగా విజయ్ దేవరకొండ ఒక్క అడుగు ముందుకు వేశాడు.

ఏకంగా హీరోయిన్ ఒడిలో పడుకుని మరి ప్రమోషన్ చేస్తున్నాడు. ముంబై లోకల్ ట్రైన్‌లో విజయ్ దేవరకొండ అనన్య పాండే జోడీ తెగ చక్కర్లు కొట్టారు. ముంబైలో తిరిగి తిరిగి అలసిపోయి.. ఇక ట్రైన్‌లో హీరోయిన్ ఒడిలో విజయ్ సేద తీరాడు. హీరోయిన్ బ్యాక్ సీటుపై చేయి అనించి మరి నిద్రపోయాడు. విజయ్ నిద్రపోతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
లైగర్ మూవీకి సంబంధించిన మాస్ అప్‌డేట్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే మాస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలుగు, హిందీ భాషల్లో ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను పూరీ జగన్నాథ్ రాయగా.. విజయ్ దేవరకొండ తన గొంతుతో పాడారు. దాంతో ఈ సాంగ్‌కు భారీ క్రేజ్ వచ్చింది.
View this post on Instagram
Advertisement
పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తొలిసారిగా పాన్ ఇండియా మూవీ లైగర్.. దాంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పూరీ, విజయ్ పాన్ ఇండియా స్టార్స్ అయిపోవడం ఖాయమని, భారత్‌ను షేక్ చేసేస్తారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది.
Read Also : Liger Movie : లైగర్ నుంచి Waat Laga Denge సాంగ్ వచ్చేసిందిగా.. !















