Janaki Kalaganaledu : జానకి రామలకు కొత్త సమస్య.. భయంతో వణికిపోతున్న వెన్నెల..?

Janaki Kalaganaledu March 16th Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. మైరావతి ఇంటికి వచ్చిన ఓబులేసు వెన్నెల ను చూసి మీరు భగవతి గారి అబ్బాయి ప్రేమించుకున్నారు కదా నేను మిమ్మల్ని చాలాసార్లు చూశాను, గుడిలో కూడా మీరు నాకు కనిపించారు అని అనగా ఓబులేసు మాటలకు వెన్నెల భయంతో వణికి పోతూ ఉంటుంది. ఇక జానకి, రామచంద్ర, వెన్నెల లు ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటారు.

ఓబులేసు గురించి మైరావతి మాట్లాడుతూ ఓబులేసు రాజమండ్రి అని పెళ్ళికొడుకు ఉండే వీధిలోనే ఉంటాడు అని జ్ఞానాంబ దంపతులకు చెప్పడం విన్న జానకి రామచంద్ర లు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వెన్నెలను చూసిన ఓబులేష్ ఆనందంతో అమ్మగారికి చెప్పాలి అని వెళుతూ ఉండగా మధ్యలోకి వెళ్లగానే ఓబులేసు తాను చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతాడు.

ఇక అతని వెనకాలే ఉన్న జానకి రామచయంద్ర లు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. ఇప్పుడున్న సమస్యలకు మరొక సమస్య ఎదురయింది అని ఆ ముగ్గురు బాధపడుతూ ఉంటారు. ఆ తరువాత కుటుంబ సభ్యులు అందరూ బయట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఉమ్మడి కుటుంబం ఉంటే ఆ ఆనందమే వేరు అని గోవిందరాజు అంటాడు.

Advertisement
Janaki Kalaganaledu March 16th Today Episode
Janaki Kalaganaledu March 16th Today Episode

ఇక రామచంద్ర జానకి ని చూసి చిన్నగా కొంటెగా ఒక రాయి విసురుతాడు. అప్పుడు మల్లిక ఇక్కడ ఏదో జరిగింది అని అనగా మైరావతి కూడా అవును అంటూ నవ్వుతూ ఆట పట్టిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే దిలీప్ వాళ్ళ ఫ్యామిలీ నిశ్చితార్థానికి మైరావతి ఇంటికి చేరుకుంటారు.

దిలీప్ ని చూసిన ఓబులేసు ఎక్కడో చూశాను అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఓబులేసు ఆలోచించడం గమనించిన రామచంద్ర లు, ఓబులేసు అసలు విషయాన్ని బయట పెట్టేలా ఉన్నాడు అని కంగారు పడుతూ ఉంటారు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Read Also : Janaki Kalaganaledu: టెన్షన్ పడుతున్న జానకి, రామచంద్ర.. సంతోషంతో ఎగిరి గంతేస్తున్న మల్లిక..?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel