వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Janaki Kalaganaledu: జ్ఞానాంబ కుటుంబాన్ని ఒకటి చేసే ప్రయత్నంలో జానకి.. జానకి ప్లాన్ ని చెడగొడుతున్న మల్లిక..?

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ వాళ్ళు పూజారిని అర్చన చేయించమని చెప్పగా మల్లిక మాకు విడిగా చేయించండి పంతులుగారు అని అంటుంది. అప్పుడు పంతులుగారు అదేంటమ్మా అని అడగగా మల్లిక అసలు విషయం ... Read more

By Ramesh Babu

Published on: October 24, 2022 10:38 AM

Updated on: October 24, 2022 10:38 AM

---Advertisement---

Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ అందరూ కలిసి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ వాళ్ళు పూజారిని అర్చన చేయించమని చెప్పగా మల్లిక మాకు విడిగా చేయించండి పంతులుగారు అని అంటుంది. అప్పుడు పంతులుగారు అదేంటమ్మా అని అడగగా మల్లిక అసలు విషయం చెప్పబోతూ ఉండగా ఇంతలో జానకి అడ్డుపడి ఏం లేదు పూజారి గారు మల్లికా కడుపుతో ఉంది తనకోసం తన పుట్టబోయే బిడ్డ కోసం విడిగా చేయించండి అలాగే అఖిల్ జెస్సి వాళ్ళ పేరు మీద కూడా విడిగానే అర్చన చేయించండి అని అంటుంది.

అప్పుడు పూజారి జానకి చెప్పిన విధంగానే అర్చన చేస్తాడు. ఆ తర్వాత మల్లికా మళ్ళీ పూజారికి అసలు విషయం చెప్పబోతూ ఉండగా జానకి గుడిలో గంటకొడుతూ మల్లిక మాటలు ఎవరికి వినిపించకుండా చేస్తుంది. అప్పుడు గోవిందరాజులు చూడమ్మా మల్లిగా నీ నోరుని రేపటి వరకు అదుపులో పెట్టుకుంటే మంచిది అని అనడంతో నా నోటికి తిండికి హద్దు ఉండదు మామయ్య అని అంటుంది.

ఆ తర్వాత జ్ఞానాంబ వాళ్లు ఇంటికి వెళ్తూ ఉండగా ఇంతలో కొంతమంది వచ్చి జ్ఞానాంబ గురించి గొప్పగా పొగుడుతూ ఆమె ఆశీర్వాదం తీసుకుంటారు. నీ వల్లే నా జీవితం ఇలా ఉంది అని అనటంతో జ్ఞానాంబ ఏమీ అర్థం కాక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు గోవిందరాజులు మా జ్ఞానం వల్ల మీరు ఏవైనా లాభం పొందారు అని అడగగా లేదండి మీ ఉమ్మడి కుటుంబం వల్ల ఎలా ఉండాలో మేము తెలుసుకున్నాము.

ఎన్ని కష్టాలు వచ్చినా అది సరే ఉమ్మడి కుటుంబంలో ఉన్నంతవరకు హాయిగా ఉంటుంది అది వేరు కాపురం పెడితే చాలా నరకంగా ఉంటుంది అని అంటారు. అప్పుడు మల్లికా ఇదే సరైన సమయం అనుకొని వేరే కాపురం పెడితే ఎటువంటి కష్టాలు ఉంటాయో చెప్పండి మీ నోటితో వినాలని ఉంది అనేటడంతో ఆమె వేరే కాపురం పెడితే ఎలా ఉంటుందో చెబుతూ ఉంటుంది.

అప్పుడు మల్లిక ఇలా చెప్పితే మా మనసు మార్చుకుంటాము అనుకుంటుందేమో అని మనసులో అనుకుంటూ ఉంటుంది. పోతావాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత జానకి చూశారు కదా విష్ణు కలిసి మెలిసి ఉన్నవారు విడిపోతే మీరు ఉండలేరు అని అంటుంది.

అప్పుడు అఖిల్ కి కూడా జానకి మంచి మాటలు చెప్పగా మధ్యలో మల్లిక కలగజేసుకొని ఏంటి జానకి మా ఆయన మనసు మార్చి ప్రయత్నం చేస్తున్నావా అంటూ విష్ణువుని మరింత రెచ్చగొడుతుంది. తర్వాత జానకి వాళ్ళు అందరూ కలిసి ఒకచోట వెళ్లి కూర్చుంటారు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel