Janaki Kalaganaledu March 15th Today Episode : బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈ రోజూ ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. జ్ఞానాంబ, గోవిందరాజులు, వెన్నెల నిశ్చితార్థం కోసం మైరావతి ఇంటికి వెళతారు. ఈ క్రమంలోనే మైరావతి అందరినీ ఇంటి గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడిస్తూ ఉంటుంది. ఆ తరువాత జానకిని తిడుతూ ఉండగా ఇంతలో జ్ఞానాంబ, జానకిని వెనకేసుకు వస్తుంది. ఇక అందరూ ఇంట్లో కి వెళ్ళండి అంటు జానకి అడ్డుపడుతుంది మైరావతి.
జానకి ని పక్కకు తీసుకువెళ్లి నువ్వు నా కోడలు ని మాయ చేసి ఇంట్లోనే ఉండి పోయావు నువ్వు మామూలు తెలివైన దానివి కాదే అంటూ జానకి పై విరుచుకు పడుతుంది మైరావతి. అయితే జానకి,మైరావతి మాట్లాడుకున్న విషయాలు అన్నీ కూడా రామచంద్ర వింటూ ఉంటాడు. జానకిని మైరావతి తిడుతూ అపార్థం చేసుకుంటూ ఉండగా, జరిగిన విషయాల గురించి వివరిస్తుంది జానకి.
వీరిద్దరూ మాట్లాడుకున్న తరువాత అక్కడి నుంచి మైరావతి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తరువాత అక్కడికి వచ్చిన రామచంద్ర ఇక్కడి నుంచి వెళ్లి పోయే వరకు జాగ్రత్తగా ఉండాలి అంటూ జానకితో చెబుతాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇందులో అక్కడికి వెన్నెలా వస్తుంది. ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఇంతలో మైరావతి ఇంటికి దగ్గరలో ఉండే ఓబులేష్ అనే వ్యక్తి వస్తాడు. అతన్ని చూసిన జానకి, రామచంద్ర, వెన్నెల టెన్షన్ పడుతూ ఉంటారు. వెన్నెల అతడు నన్ను చూస్తే ఖచ్చితంగా గుర్తు పడతాడు ఇప్పుడు ఏం చేయాలి వదిన అని జానకిని అడుగుతుంది. ముగ్గురు ఓబులేష్ ఎక్కడ అందరికీ నిజం చెబుతాడో అని కంగారు పడుతూ ఉంటారు.
కొద్ది సేపు మైరావతి, ఓబులేసు ల మధ్య ఫన్నీగా సంభాషణ జరుగుతుంది. ఆ తర్వాత మైరావతి అక్కడి నుంచి వెళ్లిపోయాక, వెన్నెలను చూసిన అతను నేను మిమ్మల్ని రెండుమూడుసార్లు ఎక్కడో చూశాను. మీరు దిలీప్ ప్రేమించుకున్నారు కదా. అయితే మీది ప్రేమ పెళ్లా. మిమ్మల్ని ఇద్దరిని గుడిలో కూడా చూశాను అని ఓబులేష్ అనగా.. అతని మాటలు విన్న జానకి, రామచంద్ర, వెన్నెల తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Janaki Kalaganaledu: అడ్డంగా బుక్కయిన మల్లిక..జ్ఞానాంబ ఏం చేయనుంది..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World