Janaki kalaganaledu: అన్నంత పని చేసిన మల్లిక.. జానకి ని శిక్షించిన మైరావతి..?

Updated on: March 18, 2022

Janaki kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..

దిలీప్, వెన్నెల నిశ్చితార్థం జరుగుతుండగా మధ్యలో మల్లిక జానకి ని పక్కకు పిలవగా, అప్పుడు జానకి రామచంద్రకు ఇప్పుడే వస్తాను అంటూ వెళుతుంది. అప్పుడు మల్లిక మీ ప్లాన్ అంతా నాకు తెలిసిపోయింది ఈ నిశ్చితార్థం నువ్వు ఆపుతావా లేక నన్ను ఆప అంటావా అని అడుగుతుంది. దీంతో మల్లిక.మాటలకు జానకి ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

జానకి మల్లికను వద్దు అని ఎంత బతిమిలాడినా కూడా మల్లి గా మాత్రం అసలు ఊరుకోదు. ఎలా అయినా సరే ఈ రోజు నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలి ఉంటుంది. దీనితో జానకి బోరున ఏడుస్తూ ఉంటుంది. మరొకవైపు నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో పంతులు ఎంగేజ్మెంట్ రింగ్స్ అడగడంతో అందరూ జానకి కోసం ఎదురు చూస్తారు.

ఇక టెన్షన్ తో భయపడుతూ అక్కడికి వచ్చిన జానకి, రింగులు ఇవ్వడానికి కూడా భయపడుతూ వుండడంతో అప్పుడు రామచంద్ర జానకీ చేతిలో ఉన్న రింగులను తీసుకొని పూజారికి ఇస్తాడు.అయినా కూడా జానకి భయపడుతూ ఉండటంతో రామచంద్రకు ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉంటాడు. ఇంతలో దిలీప్, వెన్నెల లు రంగులు మార్చుకుంటున్న సమయంలో మల్లిక వచ్చి ఆపు అంటూ ఆ నిశ్చితార్థాన్ని ఆపుతుంది.

అప్పుడు మైరావతి ఎందుకు ఆపమంటున్నావ్ అని అడగడంతో.. జానకి మిమ్మల్ని చాలా మోసం చేసింది అత్తయ్య గారు, జానకి తో పాటు వెన్నెల, మీ పెద్దకొడుకు రామచంద్ర కూడా మిమ్మల్ని దారుణంగా మోసం చేశారు. దిలీప్ వెన్నెల లు ప్రేమించుకున్నారు. అందుకే జానకి సంబంధం తీసుకొచ్చింది అంటూ అసలు విషయాన్ని బయట పెట్టేస్తుంది మల్లిక. ఆ మాటలకు జానకీ మాత్రం ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది.

Advertisement

అప్పుడు గోవిందరాజు మల్లిక పై గట్టిగా అరుస్తాడు. అయినా కూడా మల్లికా తగ్గకుండా కావాలంటే జానకిని అడగండి అంటూ జానకి ఫై నిందలు వేస్తుంది. జానకి ఎంతసేపటికి మాట్లాడక పోయేసరికి ఇంతలో జ్ఞానాంబ , జానకి ని తీసుకొని లోపలికి వెళుతుంది. ఇక మల్లికా అనే మాటలు మాట్లాడుతున్నా కూడా నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు అంటూ జానకి నిలదీస్తుంది.

జానకి ఏం మాట్లాడకపోవటంతో మల్లిక చెప్పిన మాటలు నిజం అని భావించిన జ్ఞానాంబ, జానకి ని తీసుకొని అత్తయ్య అమరావతి దగ్గర వెళ్లి మోసం చేసిన వారికి మీరు ఎటువంటి ఇస్తారో మీ ఇష్టం అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి..

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel