Guppedantha Manasu ఫిబ్రవరి 2 ఎపిసోడ్ : రిషికి నిజం చెప్పాలి అనుకున్న చక్రపాణి.. కొత్త ప్లాన్ వేసిన దేవయాని?

Updated on: February 2, 2023

Guppedantha Manasu: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో వసు, రిషి ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్తారు.

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార, రిషి నీటిలో పడవలు వదిలి మనసులో కోరికలు కోరుకొని ఆ తర్వాత కళ్ళు తెరిచి చూడగా అప్పుడు వాళ్ళిద్దరు పడవలు ఒకచోట కలుసుకోవడంతో అది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వసుధార రిషి ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతారు. ఈ పొగరు ఏంటి ఇక్కడికి వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు రిషి. అప్పుడు వసుధార రిషి సార్ కూడా నాలాగే పడవలు వదలడానికి వచ్చాడా అనుకుంటూ ఉంటాడు. ఈ పొగరు ఆ పేపర్లో ఏం రాసి ఉంటుంది అనే రిషి అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా వసుధార అక్కడికి వెళ్లి ఏంటి సార్ ఇక్కడికి వచ్చారు అనడంతో ఏం రాకూడదా ఈ చెరువు ఏమైనా నీదా అని అంటాడు.

Advertisement

అలా కాదు సార్ ఎందుకు వచ్చారు అనడంతో నాకు ఒకరు చెప్పారు లే అని అంటాడు. ఆ పడవలు ఎంత బాగా ప్రయాణిస్తున్నాయో కదా సార్ అనడంతో కానీ మనుషులు జీవితంలో మాత్రం ప్రయాణించలేదు అని బాధగా మాట్లాడి ఎక్కడి నుంచి వెళ్లిపోతుండగా రిషి కాలికి ముళ్ళు గుచ్చుకుంటుండగా పక్కకు తీసేస్తుంది. అప్పుడు తనకు గుచ్చుకోవడంతో ఏమయింది అనగా ఏమి లేదు సార్ అని అంటుంది. అప్పుడు రిషి కింద పడిపోతుండగా వెళ్లి పట్టుకుంటుంది. ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి అందరూ ఒకచోట ఉన్నారు. నేను వెళ్లి నిజం చెప్పేస్తాను అమ్మ అనడంతో వద్దు నాన్న అని చక్రపాణిని ఆపుతుంది వసుధార.

తర్వాత దేవయాని ధరణి ఈ మహేంద్ర వాళ్ళు ఎక్కడికి వెళ్లారు చెప్పారా అనగా లేదు అత్తయ్య అనడంతో వెంటనే దేవయాని ధరణి పై సీరియస్ అవుతుంది. ఇంతలో జగతి మహేంద్ర రావడంతో ఆది దంపతులు అని అంటుండగా వెనకాలే రిషి ఉండటం చూసి మౌనంగా ఉంటుంది దేవయాని. ఎక్కడికి వెళ్లారు అని పదేపదే అడుగుతూ ఉంటుంది దేవయాని. అప్పుడు దేవయాని కావాలని వసుధార గురించి తప్పుగా మాట్లాడుతూ ఉండడంతో పెద్ద నాన్న నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. అప్పుడు జగతి వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత చక్రపాణి వసుధార పదే పదే తనను ఆపుతున్నందుకు బాధపడుతూ ఎలా అయినా ఈ విషయంలో నేనే పరిష్కారం ఆలోచించాలి అని రిషి కి ఫోన్ చేస్తాడు.

అప్పుడు సిగ్నల్ లేకపోవడంతో రిషికి చక్రపాణి మాట్లాడేది వినపడదు. అప్పుడు చక్రపాణి గట్టి గట్టిగా అరుస్తూ ఉండగా ఇంతలో వసుధార అక్కడికి వచ్చి ఫోన్ కట్ చేసి ఇంకొకసారి ఇలా చేయకండి నాన్న ఇలా చేస్తే నా మీద ఒట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు దేవయాని ఈ రాజీవ్ గాడు ఎక్కడ ఉన్నాడో అని రాజీవ్ కి ఫోన్ చేయగా ఎక్కడ ఉన్నావు అనడంతో పోలీసులు నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను మేడం అని అంటాడు. సరే ఇప్పుడు కాలేజీ లో మీటింగ్ మనించాలి అంటూ రాజీవ్ దేవయాని ఇద్దరు కలిసి వసుధార ని అవమానించడానికి ప్లాన్ వేస్తారు. ఆ తర్వాత రాజీవ్ డైరెక్ట్ గా కాలేజ్ దగ్గరికి వెళ్లి మీటింగ్ హాల్లోకి వెళ్లి వసుధార అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు.

Advertisement

అప్పుడు జగతి,మహేంద్ర,ఫణింద్ర అవ్వాలని చూసి దొంగ ప్రేమలు కురిపిస్తూ మీరు మంచి వాళ్ళు సార్ అంటూ వారిని పలకరిస్తూ ఉంటాడు. అప్పుడు కాలేజీ ఫ్యాకల్టీ అందరూ రాజీవ్ వైపు అలాగే చూస్తుండగా మీ అందరికీ నేను ఎవరో తెలియదు కదా వసుధారకు తాళి కట్టిన భర్తని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు జగతి మహేంద్ర ఇద్దరు కోపంతో రగిలిపోతూ ఉంటారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel