Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : రిషిని హత్తుకొని ఎమోషనల్ అయిన మహేంద్ర.. రిషిని రెచ్చగొడుతున్న దేవయాని?

Updated on: January 28, 2023

Guppedantha Manasu జనవరి 28 ఎపిసోడ్ : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసుధార, చక్రపాణి తో మాట్లాడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్లో వసుధార చక్రపాణితో మాట్లాడుతూ అక్క వాళ్ళు బాగానే ఉన్నారు కదా నాన్న అనగా బాగున్నారా అమ్మ నువ్వు రిషి సార్ కి నిజం చెప్పావా లేదా? కావాలంటే చెప్పు నేను వాళ్ళందరి కాళ్ళ మీద పడి నిజం చెప్పేస్తాను అనడంతో వద్దు నాన్న అంటుంది వసుధార. మరొకవైపు రిషి అపార్ధాలు అలకలు అన్నీ అయిపోయాయి డాడ్. పోట్లాడుకున్నాం, గొడవపడ్డాం కానీ వసుధార ఈ విధంగా చేసింది అని బాధపడుతూ ఉండగా మహేంద్ర ధైర్యం చెబుతూ ఉంటాడు.

Devayani suggests rishi about vasu in todays guppedantha manasu serial episode
Devayani suggests rishi about vasu in todays guppedantha manasu serial episode

ఎందుకు డాడీ నేనంటే ఎవరికీ నచ్చడం లేదు అందరూ నన్ను తీసి పారేస్తున్నారు నేను ఒక వేస్ట్ ఫెలోనా అని అనడంతో వెంటనే మహేంద్ర రిషి ని హత్తుకుని బాధపడకు నాన్న అని ధైర్యం చెబుతూ నువ్వు బంగారం రా నిలువెత్తు బంగారం నిన్ను వద్దనుకున్నందుకు వాళ్లే బాధపడాలి అని అంటాడు. మరొకవైపు చక్రపాణి వసుధారకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇతను క్యాబిన్ కి వెళ్ళగా అక్కడ లవ్ సింబల్ ఉండడంతో అక్కడికి వసుధార వచ్చి వెళ్ళింది అని తెలుసుకుంటాడు. మరోవైపు వసుధార తన క్యాబిన్లో పని చేసుకుంటూ ఉండగా రిషి మొదట మెసేజ్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెబుతాడు.

Advertisement

Guppedantha Manasu january 28 Today Episode : రిషిని రెచ్చగొడుతున్న దేవయాని స్కెచ్..

ఆ తర్వాత ఫోన్ చేసి క్యాబిన్ కి రమ్మని చెప్పడంతో రా అక్కడికి వెళుతుంది. ఎందుకు వసుధర ఇక్కడికి వచ్చి నా హార్ట్ ని డిస్టర్బ్ చేశావు అని అనడంతో నేను మీతో కొంచెం మాట్లాడాలి సార్ అనగా ఏం చెప్తావు ఆ మాట 100 సార్లు అన్నావు అయినా ఏం చెప్తావో చెప్పు అనగా నా పెళ్లి గురించి సార్ అనడంతో షటాప్ వసుధార అని గట్టిగా అరుస్తాడు రిషి. నీ ఇష్ట ప్రకారమే తాళిబొట్టు కట్టించుకున్నావు కదా అనగా ఇప్పుడు కూడా అదే మాట అంటున్నాను సార్ అనడంతో ఇక వదిలేసేయ్ వసుధార నీ లిమిట్స్ లో నువ్వు ఉండు నా లిమిట్స్ లో నేను ఉంటాను అని అనడంతో వసుధార షాక్ అవుతుంది.

నువ్వు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు హెడ్ వి నేను ఈ కాలేజ్ ఎండిని ఎండి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అని అంటాడు రిషి. మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ఏవైనా ఉంటే చెప్పు వింటాను అంతేకానీ నీ పెళ్లి విషయాల గురించి మాట్లాడొద్దు వినడానికి నేను సిద్ధంగా లేను అని అంటాడు రిషి. నేను చెప్పేది పూర్తిగా వింటేనే కదా సార్ మీకు క్లారిటీ వచ్చేది అనడంతో వద్దు వసుధార నాకు ఇప్పటికే చాలా విషయాల్లో క్లారిటీ వచ్చేసింది అని గట్టిగా అరుస్తాడు. ఇక ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపోవచ్చు అని అనడంతో అప్పుడు వసుధర ఫైనల్ గా అడుగుతున్నాను సార్ నేను చెప్పేది వింటారా వినరా అనడంతో నేను కూడా ఫైనల్ గా చెబుతున్నాను నువ్వు చెప్పేది నేను వినను అని అంటాడు. అలాగే ఇంకెప్పుడు మనం అన్న పదం నువ్వు వాడొద్దు అని అంటాడు.

అప్పుడు వసుధార మనసులో సరే రిషి సార్ ఇకపై నేను మీకు నిజం చెప్పి మళ్ళీ విసిగించను మీ అంతటి మీరే నిజం తెలుసుకోవాలి అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తుండగా నా తల్లి కంటే వందరెట్లు ఎక్కువ నువ్వే నన్ను మోసం చేశావు అనడంతో వసుధార మరింత కుమిలిపోతూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇప్పుడు రిషి కోపంతో రగిలిపోతూ ఉండగా తన క్యాబిన్లోకి వెళ్లిన వసు ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రిషి ఒక సోఫాలో కూర్చుని ఉండగా ఇంతలోనే దేవయాని అక్కడికి వస్తుంది. అప్పుడు దేవయాని దొంగ ఏడుపులు ఏడుస్తూ వసుదార గురించి మాట్లాడుతూ ఆ రోజు నేను తన మన స్థాయికి తగ్గట్టు కాదు వద్దు అని చెబితే మీరు వినలేదు ఇప్పుడు చూశారు కదా ఏమయిందో అంటూ రిషి ని మరింత రెచ్చగొడుతూ ఉంటుంది.

Advertisement

Read Also : Guppedantha Manasu january 27 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన రాజీవ్.. రిషిని చూసి బాధపడుతున్న మహేంద్ర..?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel