Ennenno Janmala Bandham Oct 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో యష్ ఖుషి కి వేద అమ్మ మనసు బాధ పెట్టొద్దు అని చెబుతాడు.
ఈరోజు ఎపిసోడ్ లో వేద పడుకొని జరిగిన విషయాలను తలుచుకొని నిద్ర లేచి చూడగా పక్కన లేకపోయేసరికి ఎక్కడికి వెళ్లాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఖుషికి పెయింట్స్ మీటింగ్ ఉంది తొందరగా రెడీ చేయాలి వెళ్ళగా అక్కడే ఉన్న మాలిని ని అత్తయ్య ఖుషి ఎక్కడికి వెళ్లింది అనడంతో తనని రెడీ చేసి స్కూల్ కి పిలుచుకొని వెళ్ళిపోయాడు అని చెబుతుంది.
మరొకవైపు యష్ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు యష్ వేద గురించి తన మనసులో అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి మాళవిక, ఆది ఇద్దరు వస్తారు. అప్పుడు యష్ నువ్వు ఏం మనసులో పెట్టుకోకు బాగా చదువుకో అని ఆదికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత మాళవిక చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు సులోచనకు ఆరోగ్యం బాగోలేదు అని ఆమె భర్త ఇల్లు తుడుస్తూ ఉంటాడు.
అదంతా వేద చూస్తూ ఉంటుంది. అప్పుడు అతను కింద పడిపోతూ ఉండగా వేదా వచ్చి పట్టుకుని ఇవన్నీ మీకు ఎందుకు నాన్న అని అతనికి నచ్చ చెబుతూ ఉంటుంది. అప్పుడు సులోచన కూడా నేను చెబుతున్న వినిపించుకోలేదు వేద అని బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత వేద ఇల్లు తుడుస్తూ ఉంటుంది. మరొకవైపు యష్ మాళవికతో మాట్లాడుతూ నా వల్ల కావడం లేదు మాళవిక నా మనసు ఒప్పుకోవడం లేదు జరిగిన విషయాలు అన్నీ వేదకు చెప్పేస్తాను అనడంతో మాళవిక షాక్ అవుతుంది.
Ennenno Janmala Bandham అక్టోబర్ 25 ఎపిసోడ్ : మాళవికతో కనిపించిన యష్, వేదస్విని షాక్..
అప్పుడు కావాలనె యష్ చెప్పకుండా ఉండాలి అని మరింత భయపెడుతూ ఉంటుంది మాళవిక. ఇంతలోనే వారిద్దరి మాటలు వెనుక వైపు నుంచి ఆది విని ఎమోషనల్ అవుతూ ఉంటాడు. అప్పుడు అది అమ్మను అరెస్ట్ చేయిస్తావా నాన్న అంటూ ఎమోషనల్ అవుతూ అమ్మ లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాడు.
అప్పుడు ఆది యష్ ని నా మీద ఒట్టు వేసి చొప్పు నాన్న అమ్మని కాపాడతానని అని అడుగుతాడు. అప్పుడు యష్ ఏమి చేయలేక ఆది కి మాట ఇస్తాడు. ఆ మాటలు విన్న మాళవిక సంతోష పడుతూ ఉంటుంది. మరొకవైపు వేద ఇల్లు శుభ్రం చేస్తూ ఉండగా వేద వాళ్ళ నాన్న సులోచనకు మందులు ఇస్తూ ఉంటాడు. ఇంతలోనే వేదకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఒకవైపు మాళవిక యష్ కూడా యాక్సిడెంట్ విషయం గురించి పోలీసులతో మాట్లాడాలి అని పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతారు. మరోవైపు వేద,వాళ్ళ బావ ఇద్దరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అప్పుడు పోలీసులతో వాళ్ళు మాట్లాడితే ఉండగా ఇంతలోనే యష్ లాయర్ తో కేసు విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడు.
ఆ తర్వాత వేద ఎలా అయినా అమ్మకు అర్జెంట్ చేసిన వారిని పోలీస్ స్టేషన్ కు పంపించి తీరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దారిలో యష్ కనిపించడంతో కారు ఆపుతుంది. యష్ మాట్లాడించాలి అని అక్కడికి వెళ్ళగా ఇంతలోనే అక్కడికి మాళవిక వస్తుంది. అప్పుడు మాళవిక యష్ కలిసి ఎక్కడికో కారులో వెళ్తారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World