వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Intinti Gruhalakshmi Oct 25 Today Episode : ఇంట్లో వాళ్ళను రెచ్చగొడుతున్న లాస్య..వర్షంలో చిక్కుకున్న సామ్రాట్ తులసి..?

Intinti Gruhalakshmi Oct 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి సామ్రాట్ ఇద్దరూ గుడి దగ్గర నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ ని చూసి అక్కడ అమ్మాయిలు పొగుడుతూ మాట్లాడడంతో అది చూసి తులసి నవ్వుతుండగా సామ్రాట్ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎందుకు సామ్రాట్ ... Read more

By Ramesh Babu

Published on: October 25, 2022 9:22 AM

Updated on: October 25, 2022 11:38 AM

---Advertisement---

Intinti Gruhalakshmi Oct 25 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో తులసి సామ్రాట్ ఇద్దరూ గుడి దగ్గర నవ్వుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ ని చూసి అక్కడ అమ్మాయిలు పొగుడుతూ మాట్లాడడంతో అది చూసి తులసి నవ్వుతుండగా సామ్రాట్ సిగ్గుపడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎందుకు సామ్రాట్ గారో సిగ్గుపడుతున్నారు. ఆ అమ్మాయిలు చెప్పింది నిజమే కదా మీరు హీరోలా ఉన్నారు వయసు కూడా పెద్దగా ఎక్కువ లేదు అని అంటుంది.

Intinti Gruhalakshmi Oct 25 Today Episode
Intinti Gruhalakshmi Oct 25 Today Episode

మరి పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నారు అని అనగా మీకు తెలిసిందే కదా తులసి గారు హనీ కోసం అని అనగా అప్పుడు కోసం ఎన్నాళ్లు అని మీరు మీ పెళ్లిని ఆపుకుంటారు జీవితాంతం తోడు ఉండేది ఒక్క మీ భాగస్వామి మాత్రమే అయినా మీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపించలేదా అని తులసి అడగగా అప్పుడు సామ్రాట్ చాలాసార్లు అనిపించింది.

చాలామంది నచ్చారు కానీ కొంతమంది నా డబ్బు పరాబాదిని చూశారు మరి కొంతమంది హనీ ని యాక్సెప్ట్ చేశారు కానీ వాళ్లలో నిజాయితీ కనిపించలేదు అయినా నా గురించి వదిలేయండి మీ గురించి చెప్పండి అని ఉంటాడు సామ్రాట్. మీరు ఎందుకు రెండవ పెళ్లి చేసుకోలేదు అని అనడంతో నాకెందుకు అని అంటుంది తులసి.

మరొకవైపు అభి అంకిత దగ్గరికి వెళ్లి మనం ఎదగడం కోసం ఒకరిని డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకోవడం మేలు కదా అంకితఅనటంతో మంచిదే అని అంటుంది అంకిత. అప్పుడు అభి వాళ్ళ అత్తగారి గురించి మాట్లాడుతూ ఉండగా ఇదంతా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అభి అని అంకిత అడగడంతో మామ ఎక్కడ ఉందో ఫస్ట్ ఫోన్ చేసి అడుగు అంకిత అనగా ఇంతలో పరంధామయ్య వచ్చి నాకు ఇందాకే తెలిసి ఫోన్ చేసింది గుడికి వెళ్ళింది అని అంటాడు.

Intinti Gruhalakshmi అక్టోబర్ 25 ఎపిసోడ్ : సామ్రాట్ ని పెళ్లి చేసుకోమన్న తులసి..తులసి గురించి కుటుంబం టెన్షన్..

ఇంతలో నందు అక్కడికి వచ్చి పరాయి మగాడితో గుడికి వెళ్లడం ఏంటి అని మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు తులసి నేను నా ముగ్గురు పిల్లల కోసం లేకపోతే నా కోసమో అని కాదు కానీ ఈ వయసులో మరొకరిని ప్రేమించి వారి చేతిలో మోసపోయే అంత బలం నాకు లేదు అని అంటుంది తులసి. ఆ తర్వాత తులసి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరగా తులసి పరంధామయ్యకు మెసేజ్ చేస్తుంది.

ఇంతలోనే అనుకోకుండా పెద్ద తుఫాను వస్తుంది. మరోవైపు తులసి ఇంట్లో తులసి గురించి టెన్షన్ పడుతూ అందుకే ఇలా జరుగుతుందని ముందే చెప్పాను ఎవరు వినలేదు అని తలాఒక మాట అంటూ ఉండగా పరంధామయ్య ఎందుకు అందరూ అలా మాట్లాడుతున్నారు అని అంటాడు. తులసి కి ఫోన్ చేస్తూ ఉండగా ఫోన్ కలవకపోవడంతో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు.

మరొకవైపు తులసి వాళ్ళు వర్షంలో కారు భయం గా నడుపుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడు లాస్య రెచ్చగొట్టే విధంగా మాట్లాడడంతో అనసూయ తులసి ఈరోజు కనుక ఇంటికి రాకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది. మరొకవైపు సామ్రాట్ తులసిని కార్ లోనే ఉండమని చెప్పి పక్కనే హోటల్స్ ఉన్నాయేమో వెతకడానికి వెళ్తాడు.

Read Also : Intinti Gruhalakshmi: అనసూయని మరింత రెచ్చగొడుతున్న లాస్య.. ఆనందంలో తులసి సామ్రాట్..?

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel