Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్లో రాధ,చిన్మయి దేవి కనిపించకపోయేసరికి టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో రాధ,దేవి కనిపించలేదు అని కోపంతో రగిలిపోతూ మాధవ దగ్గరికి వెళ్లి కాలర్ పట్టుకుని దేవమ్మ ఎక్కడ?ఎక్కడ దాచావు అనిఅడుగుతుంది. అప్పుడు మాధవ నన్ను ఎందుకు అవమానిస్తున్నావు రాదా? అయినా ఇంత కోపంగా మాట్లాడుతూ ఆదిత్య తో మాత్రం ఎందుకు అంత ప్రేమగా మాట్లాడుతున్నావు అంటూ రాధకు కోపం తెప్పించే మాటలు మాట్లాడుతాడు. అప్పుడు రాధ నేను దేవి గురించి మాట్లాడితే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ మాధవ మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
మళ్లీ దేవమ్మ మనసుని ఏమైనా పాడు చేస్తున్నావా అని అడుగుతుంది. నేను మా అమ్మ మీద ఒట్టేసి అయినా అబద్ధం చెపుతానేమో గాని నీకు మాత్రం అబద్దం చెప్పను అనటంతో వెంటనే రాధా దేవి కనపడకపోతే అప్పుడు నీ సంగతి చెబుతాను అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మరొకవైపు ఆదిత్య ఆలోచించుకుంటూ ఎలా అయినా ఈరోజు మీ నాన్నను నేనే అని దేవితో చెబుతాను అని బయలుదేరుతూ ఉండగా ఇంతలోనే రాజమ్మ ఎదురుపడి ఎక్కడికి వెళ్తున్నావ్ ఆదిత్య అని అనగా బయటకు వెళ్తున్న పిన్ని అనడంతో అప్పుడు రాజమ్మ అక్క సత్య నీ కారు తీసుకుని గుడికి వెళ్లారు కొద్దిసేపు ఇంట్లోనే ఉండు అని అంటుంది.
అప్పుడు రాధని మనసులో తిట్టుకుంటూ ఉంటాడు ఆదిత్య. ఇప్పుడు ఆదిత్య ఆలోచిస్తూ ఉండగా వెంటనే రాజమ్మ నువ్వు అక్క కొడుకు అయినా నా కొడుకు అనుకోని చెబుతున్నాను జీవితంలోకి ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు ఒకరు వెళ్లిపోయారు. ఇంకొకరు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్లీ వేరే ఒక అమ్మాయి వల్ల మీ బంధం విడిపోకూడదు అని నేను కోరుకుంటున్నాను అని చెబుతుంది రాజమ్మ. మరొకవైపు రాధ వీధిలో దేవి కోసం వెతుకుతూ ఉంటుంది.
మరొకవైపు కారులో గుడికి వెళుతున్న సత్య, ఆదిత్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే అటుగా దేవి కోసం రాధా వెతుకుతూ అడ్డుగా వెళ్ళగా వెంటనే దేవుడమ్మ కారు ఆపి ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్లినట్లు ఉంది అలా ఏం లేదులే ఆంటీ గుడికి లేట్ అవుతుంది అని చెప్పి కార్ని అక్కడ నుంచి వెళ్ళమని చెబుతుంది. అప్పుడు ఆ కారుని చూసిన రాధ పెనిమిటి కారు ఇక్కడ ఉంది అంటే నేను వచ్చినట్టు తెలిసి కూడా నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అంటే నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అనుకుంటూ ఉంటుంది.
మరొకవైపు జానకమ్మ దేవి గురించి ఆలోచిస్తూ దేవుడిని కోరుకుంటున్నాం. చిన్మయి కూడా దేవి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే రామ్మూర్తి ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ అక్కడికి వచ్చి దేవి ఎక్కడున్నా సరే వెతికి చెప్పమని చెబుతాడు. ఆ తర్వాత సీన్లో దేవుడమ్మ, సత్య గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తారు. అప్పుడు ఆదిత్య ఇంటి బయట ఎదురుచూస్తూ ఉండగా అది చూసి సత్య అపార్థం చేసుకుంటుంది.
అప్పుడు ఆదిత్య దేవుడమ్మతో అమ్మా నాకు కొంచెం పని ఉంది బయటకు వెళ్లాలి అని అనగా వెంటనే దేవుడమ్మ ఒకసారి రామ్మూర్తి గారికి ఫోన్ చేయరా మాట్లాడాలి అనగా రామ్మూర్తికి ఆదిత్య ఫోన్ చేస్తాడు. అప్పుడు దేవుడమ్మ, రామ్మూర్తి గారు మేము గుడికి వెళ్లి జానకమ్మ గారికి నయమవ్వాలని అర్చన చేయించాము. అప్పుడు రామ్మూర్తి దేవి కనిపించలేదు అన్న విషయం దేవుడమ్మకు చెప్పడంతో దేవుడమ్మ షాక్ అవుతుంది. సరే దేవి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయండి నేను కూడా ఆదిత్య తో చెప్పి వెతికిస్తాను అని ఫోన్ కట్ చేస్తుంది.
అ మాటలు విన్న ఆదిత్య దేవిని వెతకడానికి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సత్య మాత్రం ఏదో ఒక సాకు దొరికింది వెళ్ళడానికి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య వెళ్తూ నిన్నటి నుంచి దేవి రాలేదంటే నాకు రుక్మిణి ఎందుకు చెప్పలేదు అని కొని పోలీస్ వాళ్లకి ఫోన్ చేసి, నాకు బాగా కావాల్సిన అమ్మాయి కనిపించడం లేదు త్వరగా వెతకండి అని ఫోటో ఇస్తాడు. అప్పుడు పోలీసులు వేతుకుతాము అని అంటారు. తర్వాత రుక్మిణికి ఫోన్ రాధా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది.
అప్పుడు ఆదిత్య దేవి కనిపించలేదు అని నాకు ఎందుకు చెప్పలేదు రుక్మిణి అంటూ సీరియస్ అవుతాడు. మరొకవైపు మాధవ దేవి గురించి ఆలోచిస్తూ ఎక్కడికి వెళ్లింది అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సత్య ఫోన్ చేసి దేవి కనిపించట్లేదు అంట కదా అన్నయ్య నిజమేనా అని అనడంతో అవును అని అంటాడు మాధవ.
Tufan9 Telugu News And Updates Breaking News All over World