Bride and groom fight: పెళ్లి అంటే బంధుమిత్రులతో ఇంట్లో ఎంతో హడావిడి ఉంటుంది. ఇక పెళ్లి జరిగే సమయంలో వధూవరుల తోపాటు ఆప్తులు, బంధుమిత్రులు అందరు ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే పెళ్లి లో జరిగే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఒక్కోసారి పెళ్లి క్యాన్సిల్ అయిన ఈ సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాలలో మాత్రం చిన్న చిన్న విషయాలు వధూవరుల మధ్య గొడవలకు దారి తీస్తుంది. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది.ప్రస్తుతం ఆ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో వధూవరులిద్దరూ స్టేజి మీద నిలబడి ఉండగా వధువు వరుడికి స్వీట్ తినిపించాలని చూస్తుంది.అయితే వరుడు మాత్రం ఫోటోలకి ఫోజులు ఇస్తూ ఎంతసేపటికీ స్వీట్ తినకపోవడంతో అసహనానికి గురైన వధువు ఆ స్వీట్ వరుడి మొహాన కొడుతుంది. వరుడు ఫోటోలకి ఫోజులు ఇస్తున్న సమయంలో వధువు అలా చేయటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వరుడు ఒక్కసారిగా వధువు చెంప చెల్లు మనిపిస్తాడు. వధువు అంతటితో ఆగకుండా మళ్లీ వరుడు చెంపమీద కొడుతుంది. ఇలా ఒకరికొకరు కొట్టుకుంటూనే ఉన్నారు.
వధూవరులిద్దరూ స్టేజ్ మీద ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు అని అనుకున్నా బంధుమిత్రులు అందరూ వారు అలా కొట్టుకోవడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఈ వీడియోని సతీష్ అనే యూజర్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 వేల వరకు లైక్స్ రాగా.. లక్షల వ్యూస్ వచ్చాయి. 1500 పైగా ఈ వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వు ఆపుకోలేరు.