ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. లేదంటే చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ మూడు రాశుల వాళ్లు ఎవరు, సమస్యలు రాకుండా ఉండాలంటే వారు ఏం చేయాలో మనం ఇఫ్పుడు తెలుసుకుందాం.
మేష రాశి.. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభ ఫలితముంది. కాకపోతే ధర్మమార్గాన్ని అనుసరించాలి. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముందస్తు ప్రణాళికలతో పని చేస్తేనే అభివృద్ధిని సాధిస్తారు. మనో బలం చాలా అవసరం. తొందర నిర్ణయాలు అస్సలే తీసుకోవద్దు. వ్యాపారంలో నష్టం వచ్చే సూచనలు ఉన్నాయి, కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆవేశపరిచే సంఘటనలు చోటు చేసుకుంటాయి. కానీ మీరు ఓపికతో ఉండి సమస్యలను పరిష్కించుకోవాలి. వారాంతంలో లక్ష్యం నెరవేరుతుంది. సూర్య నారాయణ మూర్తిని స్మరిస్తే అంతా మంచే జరుగుతుంది.
తులా రాశి.. ఈ రాశి వాళ్లు ప్రతి పనిని శ్రద్ధగా చేయాలి. ఆటంకాలు ఎదురైనా పనులను అస్సలే వాయిదా వేయవద్దు. ఉద్యోగంలో ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి. అపార్థాలకు తావివ్వవద్దు. అవమానాలను ఎదుర్కొన్నా చివరికి విజయం లభిస్తుంది. స్నేహితులవల్ల ఉపకారముంటుంది. వ్యాపారంలో కష్టపడాలి. ఆర్థికస్థితి బాగుంటుంది. నవగ్రహ శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.