Mile Stone: సాధారణంగా మనం రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వెళ్లాల్సిన గమ్యం ఇంకా ఎంత దూరం ఉందో తెలియజేయడానికి రోడ్డుపై మనకు మైలురాళ్ళు వేసి ఉంటారు. అయితే ఈ మైలురాళ్ళు ఒక్కో దానికి ఒక్కో రంగు వేసి ఉంటారు. అయితే ఇలా మైలు రాళ్ళకు వివిధ రకాల రంగులు ఎందుకు వేసి ఉంటారు. ఈ రంగులకు అర్థం ఏమిటి అనే విషయాలను ఎప్పుడైనా ఆలోచించారా. అయితే రోడ్డుపై రాళ్ళకు ఎందుకు రంగులు వేస్తారు అవి దేనిని సూచిస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
మైల్ స్టోన్స్ ఎప్పుడు కూడా రెండు రంగులలో ఉంటాయి. సగం వరకు తెలుపు రంగులో ఉన్నప్పటికీ పైన మాత్రం రంగు మాత్రం మారుతూ ఉంటాయి. ఇకపోతే మీరు ఉన్న ప్రదేశంలో మైల్ స్టోన్ పై భాగంలో పసుపు రంగు ఉంటే మీరు నేషనల్ హైవే మీద ప్రయాణం చేస్తున్నారని అర్థం. అదేవిధంగా మైల్ స్టోన్ పైభాగంలో ఆకుపచ్చ రంగు ఉంటే మీరు స్టేట్ హైవే మీద ప్రయాణం చేస్తున్నారని అర్థం.
ఒకవేళ మైల్ స్టోన్ బ్లూ, బ్లాక్ లేదా వైట్ కలర్ లో ఉంటే మీరు డిస్టిక్ లేదా సిటీలోకి ఎంటర్ అయ్యారని అర్థం అదేవిధంగా ఆ రోడ్డు మెయింటెనెన్స్ మొత్తం ఆ డిస్టిక్ లేదా సిటీ పరిధిలోకి రావడమే కాకుండా మెయింటెనెన్స్ మొత్తం ఆ సిటీ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటుందని అర్థం. ఒకవేళ నెంబరు రాయి ఎరుపురంగులో ఉంటే మీరు రూరల్ రోడ్డులో ప్రయాణం చేస్తున్నారు. ఇలా నెంబర్ రాయి ఒక్కో రంగు ఒక్కో దానిని సూచిస్తుంది. ఇప్పటివరకు మీరు ఈ తేడాను గమనించకపోతే ఇకపై ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఈ తేడాలను గమనించి మీరు ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో సులభంగా గుర్తించవచ్చు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World