Big Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6కి సంబంధించి రెండో వారం హౌస్ కెప్టెన్ కావడానికి టాస్క్ మొదలైంది. సిసింద్రీ అనే పేరుతో నిర్వహించిన టాస్క్ లో పోటీదారులంతా నువ్వా నేనా అన్న విధంగా తలపడ్డారు. అయితే రెండు దశల్లో సాగిన ఈ టాస్క్ లో మొదటి దశలో గెలిచిన గీతు, చలాకీ చంటి, రేవంత్, ఫైమా, ఆరోహి బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీలో నిలిచారు. ఈ ఐదుగురు మధ్య కెప్టెన్సీ పోటీ నడుస్తోంది. ఈ ప్రోమోలో సింగర్ రేవంత్ రియల్ ఫైటర్ అంటూ తోటి పోటీదారులతో ఫైట్ చేస్తున్నారు.
Big Boss 6 Telugu : బిగ్ బాస్ లో రెండో వారం కెప్టెన్సీ టాస్క్ సిసింద్రీ…
అయితే రెండో టాస్కుగా ఇచ్చిన సాక్స్ అండ్ షేపస్ లో గోనె సంచులు తొడుక్కుని, గెంతుకుంటూ వెళ్లి ప్లస్, మైనస్ వంటి గుర్తును అమర్చాలి. ఇందులో రేవంత్ గెలిచే సమయంలో ఫైమా అడ్డుపడి ఓడిపోయేలా చేసింది. దీంతో చంటి విజయం సాధించాడు. ఇక రేవంత్ కోపం కట్టలు తెంచుకుంది. ఫైమాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఒకరిని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం అన్నాడు. కంగ్రాట్స్ చంటన్నా అని అరిచాడు. నేనే రియల్ ఫైటర్ అంటూ అరవగా.. చంటి ఇవన్నీ వింటూ నిల్చున్నాడు.
ఆ తర్వాత అభినయ శ్రీ కల్గజేసుకొని నిన్ను గెలవనివ్వడం ఇష్టం లేకే ఫైమా అలా చేసిందని చెప్పింది. దీంతో మరింత ఫైర్ అయిన రేవంత్ ఇక్కడ నేనుంటే దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు కాబట్టి ఆ మాత్రం ఉుంటుందంటూ వ్యాఖ్యానించాడు. దీనికి ఫైమా నువ్వు గెలవడానికి నేను ఆడటం ఎందకన్నా అనగా ప్రోమో ముగిసింది.
Read Also : Big Boss 6 telugu : గలాటా గీతూ, రేవంత్ వార్.. నువ్వో అశుద్దం.. మాట్లాడటమే అసహ్యం.. వీడియో!