Big Boss 6 telugu : చాలా మంది తెగ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ హీట్ ఎపిసోడ్ రానే వచ్చింది. నామినేషన్స్ అనగానే ఒకరిపై అరుచుకోవడం, కోప్పడటం, ఆవేశం వ్యక్తం చేయడం లాంటివి జరగనే జరిగాయి. ఎప్పటిలా కాకుండా ఈసారి నామినేషన్స్ ప్రక్రియ కాస్త డిఫరెంటు గా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ లో ఎన్నడూ లేనంతగా 21 మంది సభ్యులు ఉండటంతో.. వారు ఒక్కొక్కరు ఒక్కో కంటెస్టెంట్ ను మాత్రమే నామినేట్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో ఒక్కరూ తమకు వ్యతిరేకంగా ఓటు వేసినా.. నామినేషన్ లోకి వచ్చేస్తారు.
నామినేషన్ ప్రాసెస్ లో గలాటా గీతూ.. సింగర్ రేవంత్ మధ్య వాడీ వేడిగా సాగింది. జంటగా వచ్చారని, రెండూ బ్రెయిన్స్ తో ఆడుతున్నారని, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మెరినా రోహిత్ లను ఆదిరెడ్డి నామినేట్ చేశాడు. మెరినా రోహిత్ లను సిల్లీ రీజన్ తో ఆదిరెడ్డి నామినేట్ చేయడంతో ఇనయాకు కోపం వచ్చింది. ఆది రెడ్డి హైట్ గా ఉన్నాడని, తనకు అది అడ్వంటేజ్ ఉంది కాబట్టి.. నామినేట్ చేస్తున్నానంటూ ఇనయ కౌంటర్ ఇచ్చింది.
ఫైమా తనతో సరిగ్గా మాట్లాడటం లేదని వాసంతి నామినేట్ చేసింది. షానీ సేఫ్ గా ఆడుతున్నాడనిపిస్తోందంటూ.. అభినయ, శ్రీ సత్య నామినేట్ చేశారు. తనను నామినేట్ చేయడంతో అభినయను నామినేట్ చేశాడు షానీ. ఈ క్రమంలో గీతూ రేవంత్ మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. చీచీ నీతో మాట్లాడటమే అసహ్యంగా ఉందనే స్థాయిలో గీతూ పై రేవంత్ మండిపడ్డాడు. నువ్వో అశుద్ధం అంటూ కడిగిపడేశాడు.
Read Also : Adi reddy : బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ.. గలాటా గీతూ, ఆదిరెడ్డిల కామెంట్లు!