Adi reddy : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో రచ్చ రచ్చ అవుతోంది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ పర్వం పోటాపోటీగా సాగింది. తొలివారం నాటి నామినేషన్స్.. ఎలిమినేషన్స్ అంతా తూచా అని ఓట్లు అన్నీ వేయించుకున్న తర్వాత ఎలిమినేషన్ లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈవారం నో ఎలిమినేషన్ అని.. ఓట్లు వేసిన వాళ్లంతా బకరాలని చేశారంటూ చెప్పకనే చెప్పేశారు.
Adi reddy : బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ..
ఈ రెండో వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రిక్రియకలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంటి సభ్యులు ఒకరినొకరు నామినేట్ చేసుకుంటూ వారి వారి తప్పుల్ని ఎత్తి చూపుతున్నారు. అయితే ప్రతీసారి ఒక్కో ఇంటి సభ్యుడు ఒక్కొకర్ని నామినేట్ చేస్తూ వస్తాయి. అయితే ఈసారి కాస్త డిఫరెంట్ ఒక్కొక్కరూ ఒక్కో ఇంటి సభ్యుడిని మాత్రమే నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్.
ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేయగా… ప్రతీ కుక్కకూ ఓ రోజు వస్తుందంటూ గలాటా గీతు కామెంట్లు చేసింది. ఆదిరెడ్డి బిగ్ బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా నామినేట్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి నామినేషన్స్ పర్వాన్ని చూడాలంటే ఈరోజు రాత్రి ఎపిసోడ్ ప్రారంభం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
Read Also : Big Boss 6 Revanth : నాదే తప్పయితే.. నేనే వెళ్లిపోతా.. బోరుమని ఏడ్చేసిన రేవంత్..