Telugu NewsLatestKarthika Deepam serial Sep 16 Today Episode : మోనిత ప్లాన్ ని పసిగట్టిన...

Karthika Deepam serial Sep 16 Today Episode : మోనిత ప్లాన్ ని పసిగట్టిన దీప.. ఎమోషనల్ అవుతున్న సౌర్య..?

Karthika Deepam serial September 16 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఇంటి దగ్గరికి ఇద్దరు ఆడవాళ్లు వస్తారు. ఈ రోజు ఎపిసోడ్లో ఇద్దరు ఆడవాళ్లు మోనితతో మేడం మా ప్రకృతి వైద్యశాలలో గతం గుర్తుకు రావడానికి మందు ఇస్తాము అని అనగా వెంటనే మోనిత ఇలా మాటలు చెప్పి డబ్బులు గుంజే వారిని చాలా చూసాము అని కోపంగా అరిచి అక్కడ నుంచి వాళ్ళని వెళ్లిపోమంటుంది. వారి మాటలు వింటున్న దీప నాకు తెలిసి నువ్వు పిలుచుకొని వెళ్ళవు అని కోపంతో చూస్తూ ఉంటుంది.

Advertisement
Sourya gets upset as she fails to find Deepa's identity i todays karthika deepam serial episode
Sourya gets upset as she fails to find Deepa’s identity i todays karthika deepam serial episode

ఆ తర్వాత ఆ మహిళలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఎవరైనా గతం గుర్తుకు వస్తుంది అంటే సరే వస్తామంటారు కానీ ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మాట్లాడుతూ వెళ్తూ ఉండగా ఇంతలో దీప వారిద్దరినీ ఆపి వారి వైద్యశాల గురించి వివరాలు అడిగి తెలుసుకుంటుంది. వారితో ఫోన్ నెంబర్ కూడా ఇప్పించుకుంటుంది. అప్పుడు ఆ మహిళ ఆ మందు నువ్వు వచ్చి ఇలా తీసుకెళ్లొచ్చు కానీ ఆ మందుకి సూర్య కిరణాలు తగలకూడదు కాబట్టి రాత్రి సమయంలోనే వచ్చి రాత్రి తీసుకుని వెళ్లాలి అని అంటుంది.

Advertisement

ఆ తర్వాత దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం వివరిస్తుంది. డాక్టర్ వాళ్ళ అన్నయ్య కూడా దీప కు ధైర్యం చెప్పి ఈరోజు రాత్రికి బయలుదేరు అని అంటాడు. మరొకవైపు మోనిత కార్తీక్ ముందు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఆతికి మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడు మోనిత మన బాబుని తీసుకురావడానికి వెళ్తాను అంటూ కార్తీక్ కి దొంగ మాటలు చెబుతూ ఉంటుంది.

Advertisement

Karthika Deepam serial Sep 16 Today Episode : ఎమోషనల్ అవుతున్న సౌర్య..?

అప్పుడు కార్తీక్ నేను కూడా వస్తాను అని అనగా వద్దు నువ్వు ఇక్కడే ఉండు శివ నిన్ను చూసుకుంటాడు నిన్ను వెళ్లి తీసుకొని వస్తాను అని అంటుంది. అప్పుడు దీప గురించి తలుచుకొని ఈ పాపం దీప అమాయకురాలు ఏది చెప్తే అది నమ్మేస్తుంది అని అనుకున్న నవ్వుతూ ఉంటుంది. మరొకవైపు దీప ఇంటికి తాళం వేసి బ్యాగు సర్దుకొని బయటకు వెళ్తూ ఉండగా ఇంతలోనే మోనిత ఎదురుపడి ఏంటి వంటలక్క బ్యాగు సర్దుకుని వెళ్తున్నావు.

Advertisement

కార్తీక్ ఇంకా దక్కడు అని తెలిసి వెళ్ళిపోతున్నావా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు సరే వంటలక్క ఆల్ ద బెస్ట్ అని అంటుంది మోనిత. ఇక దీప అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మోనిత నేను చూస్తే జాలి వేస్తుంది దీపక్క అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దీప బ్యాక్ పట్టుకుని సౌర్య వాళ్ళ బాబాయ్ ఆటో దగ్గరికి వస్తుంది. అప్పుడు ఆ ఆటో వెనుక అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు అన్న కొటేషన్ చదివి గతంలో శౌర్య అన్న మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతుంది. ఇక ఆ తర్వాత దీప ఇంద్రుడు ఆటో ఎక్కుతుంది.

Advertisement

ఇంతలోనే శౌర్య ఫోన్ చేసి కొన్ని సరుకులు చెప్తాను తీసుకొని రా బాబాయ్ అని అనగా సరే అని చెప్పిదీప ని సరుకులు రాయమని చెప్పి ఫోన్ ఇస్తాడు. అప్పుడు దీప గొంతు విన్నశౌర్య గుర్తుపట్టి ఎమోషనల్ అవుతుంది. కానీ దీప కు మాత్రం ట్రాఫిక్ వల్ల సౌర్య గొంతు ఏమీ సరిగా వినిపించదు. ఆ తర్వాత దీప ఆటో దిగి వెళ్తూ ఇక్కడ ఆయుర్వేదిక్ మందు అమ్ముతారు అంట కదా గతం గుర్తుకు రావడానికి అని ఇంద్రుడితో చెబుతుంది.

Advertisement

అప్పుడు ఇంద్రుడు ఇక్కడ అలాంటివి ఏమీ లేవు అమ్మ దాని పక్కనే మా ఊరు అందుకే గట్టిగా చెబుతున్నాను అని అనడంతో అప్పుడు దీప ఇదంతా ఆ మోనిత ప్లాన్ రెండు రోజులు నన్ను ఊర్లో లేకుండా చేయాలి అనుకుంది అని పసిగట్టి వెంటనే అక్కడికి వెళ్లాలి అనుకుంటుంది. ఇంతలోనే సౌర్య వాళ్ళ బాబాయ్ కి ఫోన్ చేసి ఇందాక నువ్వు మాట్లాడిన ఆమె ఫోటో పంపు అని అనగా ఎందుకు బంగారు అంటే అది మా అమ్మ గొంతులా ఉంది అని అంటుంది.

Advertisement

ఆవిడ లేదు అప్పుడే వెళ్ళిపోయింది అనడంతో సౌర్య నిరాశపడుతుంది. ఆ తర్వాత డాక్టర్ బాబు వాళ్ళ అమ్మ ఎదురు దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దీప అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మనం మోసపోయాం అన్నయ్య ఆ మోనిత అబద్ధం చెప్పి నన్ను ఊర్లో రెండు రోజులు లేకుండా చేయాలి అనుకుంది అని అనడంతో వారు ముగ్గురు షాక్ అవుతారు.

Advertisement

Read Also : Karthika Deepam june 15 Today Episode : శోభకు అడ్డంగా దొరికిపోయిన హిమ.. బాధలో నిరుపమ్..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు