Karthika Deepam serial September 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కు వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఏం కాదు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కోపంగా దీప ఇంటి దగ్గరికి వచ్చి వంటలక్క అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు రండి డాక్టర్ బాబు అని అనగా నేను రా నువ్వే బయటికి రా అని గట్టిగా అరుస్తాడు కార్తీక్. ఏమైంది డాక్టర్ బాబు అని అడగగా మీ అన్నయ్య అని చెప్పి ఎవర్నో పిలుచుకొచ్చి డాక్టర్ అని అబద్ధం ఆడతావా అని అంటాడు కార్తీక్.
అప్పుడు దీప మీకు నిజం తెలిస్తే నేను ఇలా మీ ముందు మాటలు పడాల్సిన దానికి కాదు అనగా వెంటనే కార్తీక్ ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడమంటే ఎప్పుడో గతం అంటావ్ ఏంటి అని అంటాడు. అప్పుడు దీప కార్తీక్ మాటలకు ఎమోషనల్ అవుతుంది. మోనిత నాకు ముందే చెప్పింది ఆ దీప మంచిది కాదు అని కానీ నేను వినకుండా నిన్ను వెనకేసుకొచ్చాను అని అంటాడు.
కానీ ఎప్పటికప్పుడు మీ తప్పులు నా అభిప్రాయాన్ని తప్పు అని చూపిస్తున్నాయి అని అంటాడు. అప్పుడు మౌనిక చెప్పిన మాటలు అన్నీ చెప్పడంతో దీప మరింత బాధపడుతూ ఉంటుంది. కార్తీక్ ఎన్ని మాటలు అంటున్నా కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఎమోషనల్ అవుతూ ఉంటుంది దీప. మరొకవైపు మోనిత ఎలా అయిన తన కొడుకుని తీసుకుని రావాలి అని అనుకుంటూ ఉంటుంది.
కానీ కార్తీక్ ని పిలుచుకుని వెళ్తే అందరూ అక్కడ గుర్తుపడతారు ఇక్కడ వదిలేసి వెళ్తే ఆ దీప మాయమాటలు చెబుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మోనిత. మరొకవైపు దీప జరిగిన విషయాలు అన్ని ఇవాళ డాక్టర్ అన్నకు వాళ్ళ అమ్మకు చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది.
నేను నువ్వు చెప్పిన విధంగానే మౌనంగానే ఉన్నాను అన్నయ్య కానీ ఆ మోనిత నామీద లేనిపోని మాటలు అన్నీ చెప్పి డాక్టర్ బాబు మనసు చెడగొడుతోంది అని అంటుంది. అప్పుడు వాళ్లు దీపకు ధైర్యం చెబుతూ ఉంటారు. కానీ దీప మాత్రం ఎమోషనల్ అవుతూ ఉంటుంది. గతంలో దీప,కార్తీక్ ని మోనిత చర నుంచి కాపాడుకున్న విషయాలన్నీ గుర్తుచేసి మరింత ధైర్యం చెబుతాడు దీప వాళ్ళ అన్నయ్య.
Karthika Deepam serial Sep 15 Today Episode : సౌర్యతో ఫోన్ మాట్లాడిన దీప..?
మరొకవైపు హిమ, ఆనంద్ ని ఇంటికి పిలుచుకొని వద్దాము తాతయ్య అని ఆనంద్ రావు అని బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ ఆనందరావు మౌనంగా ఉండడంతో హిమ మాట్లాడు తాతయ్య అని అంటూ ఉంటుంది. మరొకవైపు వారణాసి, ఇంద్రమ్మ సౌర్యని బయటకు వెళ్లకుండా ప్లాన్ చేయగా ఇంతలను శౌర్య అక్కడికి వచ్చి మీరు ఇలా చేస్తారని నాకు తెలుసు అని అంటుంది.
వాళ్ళందరూ బయటకు వెళ్లొద్దు అని ఎంత చెప్పినా కూడా సౌర్య వినిపించుకోకుండా వెళ్తాను అని వారణాసి తో కలిసి బయటికి వెళుతుంది. మరొకవైపు డాక్టర్, వాళ్ళ అమ్మ దీప చేసిన వంటలు తిని దీపని పొగుడుతూ ఉంటారు. అప్పుడు ఆ డాక్టర్ అన్న కార్తీక్ ని ఇక్కడికి పిలుచుకుని వస్తే గతం గుర్తుకు వచ్చేలా చేద్దాము కానీ కార్తీక్ రావాలి కానీ మనం బలవంతంగా తీసుకురాకూడదు అని చెబుతాడు.
అప్పుడు దీప వాళ్ళ అన్నయ్య దీప కి ప్లాన్ చెప్పి నిదానంగా ఆలోచించి వ్యవహరించమని చెబుతాడు. అప్పుడు దీప ఎలా అయినా నా భర్త నేను నా ప్రేమతో దక్కించుకుంటాను అని అంటుంది. మరొకవైపు దగ్గరికి ఇద్దరు మహిళలు వచ్చి ఇక్కడికి కొద్దిగా దూరంలో మాకు ప్రకృతి వైద్యశాల ఉంది అక్కడ గతం మర్చిపోయిన వాళ్లకు మందు ఇస్తాము అని అనడంతో మోనిత మాత్రం ఇలా అబద్ధాలు చెప్పే డబ్బులు గుంజే వారిని చాలామందిని చూశాము అని అంటుంది.
ఆ మాటలు విన్న దీపసంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ మోనిత మాత్రం ఇకనుంచి వెళ్ళండి వారిపై అరుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప అనుకోకుండా ఇంద్రుడు ఆటో ఎక్కుతుంది. ఇంతలోని సౌర్య ఫోన్ చేసి సరుకులు లిస్టు చెబుతాను అని అనగా దీప ఫోన్ తీసుకొని మాట్లాడుతుంది. దీప గొంతు విన్నసౌర్య గుర్తుపట్టి ఎమోషనల్ అవుతుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World