Karthika Deepam june 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా ఇక్కడి నుంచి వెళ్ళిపో తింగరి అంటూ హిమ పై కోప్పడుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో హిమ,జ్వాలా గురించి ఆలోచిస్తూ ఉంటుంది. జ్వాలా కి ఎవరు ఫోన్ చేసి ఉంటారు. ఆ అవసరం ఎవరికి ఉంది. ఎవరైనా కావాలనే ఆటపట్టిస్తున్నారా అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది హిమ. అదే విషయం గురించి జ్వాల తో మాట్లాడాలి అని బయలుదేరుతూ వద్దులే మరి కోపంతో నాతో మాట్లాడకపోతే నిరుపమ్,బావని జ్వాలాని ఒకటి చేయలేను అని ఆగిపోతుంది.

మరొకవైపు శోభ హాస్పిటల్ పెట్టడానికి మెయింటెన్ చేయడం కోసం వరుసగా లోన్ లు తీసుకుంటూ ఉంటుంది. అప్పుడు శోభ తన కష్టాలు, అప్పులు తీరాలంటే తప్పకుండా నిరుపమ్ ని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఒక పేషెంట్ అక్కడికి వచ్చి మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు.
బ్లడ్ సమయానికి దొరకడం లేదు అని చెప్పగా వెంటనే శోభ ఇంతకు ముందు మీ అమ్మగారికి ఎవరు బ్లడ్ ఇచ్చారు అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఆదిత్య హాస్పిటల్ డాక్టర్ హిమ గారు ఇచ్చారు అనడంతో శోభ షాక్ అవుతుంది. అప్పుడు శోభ, హిమ గురించి ఆలోచిస్తూ క్యాన్సర్ అని చెప్పింది కదా మరి అలాంటప్పుడు బ్లడ్ ఎలా ఇస్తుంది అని ఆలోచిస్తూ ఉంటుంది.
మరొకవైపు జ్వాలా ఆటో దగ్గర నిలబడి జరిగిన విషయం గురించి తలుచుకుని బాధ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత హిమ పేషెంట్ కి బ్లడ్ ఇవ్వడం కోసం శోభ వాళ్ళ హాస్పిటల్ కీ వస్తుంది. మరొకవైపు జ్వాలా,నిరుపమ్ దగ్గరికీ వెళ్ళి జరిగిన విషయం గురించి సారీ చెప్పి అనంతరం ఐ లవ్ యు చెబుతుంది.
తీరా చూస్తే అక్కడ నిరుపమ్ లేకపోవడంతో ఆశ్చర్యపోతుంది జ్వాల. ఆ తరువాత హిమ, పేషెంట్ కి బ్లడ్ ఇచ్చి వెళ్తూ ఉండగా ఇంతలోనే శోభ ఎదురుపడి ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో హిమ టెన్షన్ తో అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
ఆ తర్వాత హిమ, సౌర్య ఫోటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఏంటి సౌర్య ఇది ఇన్నేళ్ల తరువాత కలిసినా కూడా మన ఇద్దరం దూరంగా ఉండడం ఏంటి అని బాధపడుతూ ఉంటుంది హిమ. మరొకవైపు నిరుపమ్ భోజనం చేస్తూ హాస్పటల్లో జ్వాలా అన్న మాటలను గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు.
అనవసరంగా హిమ,జ్వాలా లో లేనిపోని ఆశలు కల్పిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, హిమ ను గుడికి బలవంతంగా తీసుకెళ్ళి తాళిబొట్టు కడుతూ ఉండగా అది చూసిన జ్వాలా ఒక్కసారిగా షాక్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Karthika Deepam june 14 Today Episode : మాస్టర్ ప్లాన్ వేసిన శోభ..జ్వాలా, హిమ లకు షాక్ ఇచ్చిన నిరుపమ్..?