Karthika Deepam serial September 17 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. దీప వాళ్ళ డాక్టర్ అన్నయ్య వాళ్ళ అమ్మ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ లో డాక్టర్ వాళ్ళ అమ్మ ఎదురు దీప గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో దీప రావడం చూసి షాక్ అవుతారు. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అనగా ఆ మోనిత నన్ను మోసం చేసింది. ఆ ఆటో వాడు చెప్పకపోయి ఉంటే నేను నిరాశతో వచ్చేదాన్ని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు.

నేను రెండు రోజులు ఊర్లో లేకుండా చేసింది అంటే డాక్టర్ బాబును ఎక్కడికైనా తీసుకెళ్తుందేమో అన్నయ్య అంటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గా ఉన్నారు లేదో చూసావా అంటే ఆయన ఉన్నారు అని చెబుతుంది. అంటే మోనిత ఏదో ప్లాన్ వేసింది అందుకే నిన్ను పంపించింది అని అంటాడు డాక్టర్. మరొకవైపు మోనిత నేను వెళుతున్నాను నువ్వు మీ సార్ ని జాగ్రత్తగా చూసుకో.
ఆ వంటలకు వస్తే లోపలికి రానివ్వద్దు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సౌర్య వాళ్ళ బాబాయ్ సరుకులు తీసుకుని రావడంతో ఇంద్రమ్మ ఆ సరుకులు చేస్తూ ఉండగా ఇంతలో సౌర్య అక్కడికి వచ్చి ఏంటి బాబాయ్ ఇన్ని సరుకులు తెచ్చావు ఏదైనా హోటల్ పెడుతున్నారా అని అడుగుతుంది. అప్పుడు ఇంద్రమ్మ లేదమ్మా పక్కింట్లోకి కొత్తవాళ్లు వచ్చారు వారికి వండి పెట్టాలి అని అంటుంది.
ఆ తర్వాత సౌర్య ఆ సరుకుల లిస్టు చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. చేతిరాత మా అమ్మదే అని గుర్తు పడుతుంది. అప్పుడు ఇంద్రమ్మ దంపతులు చాలామంది రాస్తారు కదా అని అనగా లేదు పిన్ని మా అమ్మ చేతిరాత నేను గుర్తు పడతాను ఇది మా అమ్మ చేతి రాతే అని శౌర్య ఎమోషనల్ అవుతుంది.
మీరు మా అమ్మ నాన్న ఉన్నారు అంటే నమ్మలేదు ఇదే సాక్ష్యం పిన్ని అని అంటుంది. మరొకవైపు హిమా సౌందర్య దంపతులు కార్లో ఆనంద్ ని పిలుచుకొని రావడానికి వెళ్తారు. మరొకవైపు మోనిత ఆనంద్ ని తీసుకెళ్లడానికి వస్తుంది. అప్పుడు లక్ష్మణ్ వాళ్లు బాబుని మోనిత తీసుకొని వెళ్తుంటే బాధపడుతూ ఉంటారు.
Karthika Deepam serial Sep 17 Today Episode : సరికొత్త ప్లాన్ వేసిన దీప..?
అప్పుడు మోనిత మీరు నాకు ఆస్తిని ఇవ్వాల్సిన పనిలేదు బాబును ఒకటి తీసుకుని వెళ్తాను అని బాబుని తీసుకుని వెళుతుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య, ఆనంద్ రావు, హిమ వస్తారు. అప్పుడు ఆనంద్ గురించి అడగగా ఇప్పుడే మోనిత అమ్మ వచ్చి తీసుకుని వెళ్ళింది వాళ్ళు షాక్ అవుతారు. ఎంతసేపు అయింది అని అనగా ఇప్పుడే అని అనడంతో ఆనంద్ రావు లు హిమ వాళ్ళు బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత కార్తీక్ పాత పాటలు పాడుకుంటూ ఉండగా అప్పుడు శివా వచ్చి మీరు కూడా నాలాగే సార్ మీకు కూడా పాత పాటలు అంటే ఇష్టం అని అంటాడు. కాదు శివ అని అనగా అవును సార్ మేడం ఇంకా లేదు కదా అందుకే పాత పాటలు వస్తున్నాయి అనడంతో అతన్ని కొడతాడు. అలా వారిద్దరూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే దీప అక్కడికి వస్తుంది.
శివ మాత్రం లోపలికి దీప ని వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటాడు. అప్పుడు దీప, శివ ద్వారా చిన్నచిన్నగా మోనిత గురించి తెలుసుకుంటుంది. ఇక మోనిత చెన్నై వెళ్ళింది అని తెలుసుకున్న దీప నన్నే బురిడీ కొట్టిస్తావు కదా ఇక నీ పని చెబుతాను అని అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Read Also : Karthika Deepam serial Sep 16 Today Episode : మోనిత ప్లాన్ ని పసిగట్టిన దీప.. ఎమోషనల్ అవుతున్న సౌర్య..?