...

Roja: హైపర్ ఆది బుల్లెట్ భాస్కర్ చెంప చెళ్లుమనిపించిన రోజా… షాక్ లో కంటెస్టెంట్ లు!

Roja: జబర్దస్త్ జడ్జ్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం పలు కార్యక్రమాల ద్వారా రోజా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. ఉగాది పండుగ సందర్భంగా ఈ టీవీ వారు అంగరంగ వైభవంగా అనే కార్యక్రమం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకునే కార్యక్రమంపై అంచనాలను పెంచింది.

ఈ కార్యక్రమానికి సీనియర్ నటీనటులు అలాగే యాంకర్ రష్మీ, శ్రీముఖి, సుమ, ప్రదీప్, జీవిత రాజశేఖర్ దంపతులు వంటి వారు హాజరయ్యారు. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి రోజా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక పోతే ఈ కార్యక్రమంలో కూడా పెళ్లి తంతు కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది అయితే ఈసారి బుల్లితెర నటీనటులు మంజుల, నిరుపమ్ కి పెళ్లి చేయడం ఎంతో ఆకర్షణగా నిలిచింది.ఇకపోతే ఈ ప్రోమో చివరిలో రోజా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుల్లెట్ భాస్కర్ హైపర్ ఆది పై చేయి చేసుకున్నారు. ఇలా రోజా ఉన్నఫలంగా వీరిద్దరిని కొట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇలా రోజా వీరిపై చేసుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…`మీరు మాకు ఇవ్వకపోతే అక్కడేం చేస్తారని ప్రశ్నించాడు .భాస్కర్‌. దీంతో గట్టిగా రియాక్ట్ అయిన రోజా.. నువ్వు .. బీప్‌.. గురించి మాట్లాడకు అని అనడంతో, నేను బరాబర్‌ ఇలానే మాట్లాడతాను అని అనడంతో వెంటనే బుల్లెట్ భాస్కర్ చెంప చెల్లుమనిపించింది. ఇలా బుల్లెట్ భాస్కర్ పై చేయి చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు.ఇకపోతే మధ్యలో హైపర్ ఆది కలగజేసుకుని ఇలా ఒక ఆర్టిస్ట్ పై చేయి చేసుకోవడం సరైన పద్ధతి కాదు అంటూ చెప్పగా వెంటనే హైపర్ ఆది చెంపపై లాగి పెట్టి కొట్టారు.ఈ విధంగా రోజా వీరి పై చేయి చేసుకోవడంతో అసలు ఏం జరిగిందనే విషయం గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే ఈ పలువురు స్పందిస్తూ కేవలం రేటింగ్ కోసం మాత్రమే ఇలా చేశారని ఈసారి కూడా అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేయాలని ఇలా ప్లాన్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.