Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి నేత కార్మికులకు అండగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. వీడియో ద్వారా కీలక సందేశాన్ని ఆయన షేర్ చేశారు.

By Ramesh Babu

Published on: August 6, 2026 11:52 PM

Updated on: August 7, 2026 10:26 PM

Handloom Day 2026 National Handloom Day

---Advertisement---

  • చేనేత ఉత్పత్తులు కొనండి.. నేత కార్మికులకు తోడుగా నిలవండి
  • ప్రధాని మోదీ ప్రత్యేక విజ్ఞప్తి.. ఫ్రెండ్‌షిప్ డే గురించి ప్రస్తావన
  • జాతీయ చేనేత దినోత్సవంపై ప్రజలకు ప్రత్యేక పిలుపు

PM Modi Video : దేశీయ చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వీడియో విడుదల చేశారు. ఈసారి వీడియోలో చేనత రంగానికి సంబంధించి ప్రజలకు ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని మోదీ కోరారు.

అలాగే, చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి తద్వారా దేశంలోని లక్షలాది మంది నేత కార్మికులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా (PM Modi Video) ప్లాట్ ఫారంలపై ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో విడుదల చేసిన డైరెక్ట్-టు-కెమెరా వీడియోలో ఆయన ఈ సందేశాన్ని షేర్ చేశారు. ముఖ్యంగా యువతతో మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియోను విడుదల చేసినట్లు సమాచారం.

Advertisement

PM Modi Video : ఫ్రెండ్‌షిప్ డేలాగే చేనేతకు సపోర్టు చేయండి :

ప్రధాని మోదీ వీడియోలో మాట్లాడుతూ.. ఇటీవల ప్రజలు ఫ్రెండ్‌షిప్ డేను ఎంతో ఆనందంగా జరుపుకున్న విషయాన్ని ప్రస్తావించారు. అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని సూచించారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. రోజువారీ జీవితంలో భాగంగా మార్చుకోవాలన్నారు.

Read Also : Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

తద్వారా దేశీయ చేనేత రంగానికి బలమైన మద్దతు అందించవచ్చని తెలిపారు. మోదీ అభిప్రాయం ప్రకారం.. ప్రతి చేనేత వస్త్రం వెనుక నేత కార్మికుడి శ్రమ, నైపుణ్యం, అంకితభావం దాగి ఉంటాయి. అలాంటి ఉత్పత్తులను వినియోగించడం ద్వారా వేలాది కుటుంబాల జీవనోపాధికి ప్రత్యక్షంగా తోడ్పాటు అందుతుందని మోదీ వివరించారు.

‘వోకల్ ఫర్ లోకల్’కు మళ్లీ ప్రాయారిటీ :

చేనేత వస్త్రాలను ఎంచుకోవడం కేవలం దుస్తుల ఎంపిక మాత్రమే కాదన్నారు. అది భారతీయ కళాకారులను ప్రోత్సహించడంతో పాటు స్థానిక ఉత్పత్తులను ఆదరించడం, దేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో భాగమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘వోకల్ ఫర్ లోకల్’ భావనను బలోపేతం చేయడంలో కూడా చేనేతకు కీలక పాత్ర ఉందని ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు.

Advertisement

Read Also : Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

భారత్‌లోని నేత వర్గాలు తరతరాలుగా సంప్రదాయ కళలను కొనసాగిస్తున్నాయని, వారి కృషిని గౌరవించడం ప్రతి భారతీయుడి బాధ్యతగా మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువత భారతీయ చేనేత వస్త్రాల పట్ల మరింత ఆసక్తి చూపాలని పిలుపునిచ్చారు.

ప్రతి సంవత్సరం ఆగస్టు 7న దేశవ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారత చేనేత రంగం దేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థకు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా దేశ ప్రజల్లో చేనేత ఉత్పత్తుల వినియోగంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతోంది.

ఇటీవలి కాలంలో ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా వివిధ జాతీయ అంశాలపై నేరుగా ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశాలు ఇస్తున్నారు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా రూపొందిస్తున్న ఈ వీడియోలు సోషల్ మీడియాలో భారీగా చర్చనీయాంశంగా మారాయి.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :