Guppedantha Manasu Aug 13 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి జగతిని కాలేజీ ఎండి గా ఉండమని చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో జగతి తాను కాలేజీ ఎండిగా ఉండడానికి అర్హతలు లేదని, కాలేజ్ ఎండి గా ఉండే అర్హత కేవలం మీకు మాత్రమే ఉంది అని రిషితో అంటుంది. ఇంతలోనే సాక్షి డ్రెస్సులు తీసుకుని వచ్చి ఇందులో ఏది బాగుందో చెప్పు రిషి అని అడగగా వెంటనే రిషి వసుని తలచుకొని ఈ డ్రెస్సులు నీకు బాగోవు వసుధార అని అనడంతో సాక్షి కోపంతో రగిలిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

Guppedantha Manasu Aug 13 Today Episode : వసు ముందు మనసులోని మాటలు బయటపెట్టిన రిషి..
మరొకవైపు వసుధార రిషి ఫోటో చూస్తూ జరిగిన విషయాలు అన్ని తలచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే జగతి అక్కడికి వచ్చి మాట్లాడుతూ మాట్లాడుతూ ఎమోషనల్ అవుతుంది. అప్పుడు వసు రిషి సార్ ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు అని అనడంతో జగతి బాధపడుతుంది. అప్పుడు జగతి నాకు ఎందుకో ఈ పెళ్లి జరగదు అనిపిస్తుంది అని అంటుండగా ఇంతలోనే దేవయాని ఎంట్రీ ఇస్తుంది.
అప్పుడు దేవయాని మాట్లాడుతూ జగతి నీతో చాలా పనులు ఉన్నాయి ఎంతైనా కన్నతల్లి కదా అంటూ జగతిని అవమానించే విధంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి జరిగిన విషయాల గురించి తలుచుకొని ఆలోచిస్తూ నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం అవుతుందా అని తనలో తానే మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వచ్చినట్లుగా ఊహించుకుంటాడు.
అప్పుడు తన మనసులో ఉన్న మాటను వసు ముందు బయట పెడతాడు రిషి. అప్పుడు బాగా ఎమోషనల్ గా మాట్లాడుతూ ఇంతలో వసు కనిపించకపోయేసరికి అదంతా తన ఊహ అని అనుకుంటాడు. ఇంతలోనే ధరణి వచ్చి ఏంటి రిషి ఇది అని అనగా ఏం జరుగుతుందో చూద్దాంలే వదిన అని అంటాడు రిషి. ఆ తర్వాత మహేంద్ర జగతి ఇద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మహేంద్ర ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను జగతి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటాడు.
అప్పుడు జగతి మాత్రం మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్లిన జరిగేది జరుగుతుంది ఇక్కడే ఉండాలి అనే మహేంద్ర చెబుతుంది. మరోవైపు నిశ్చితార్థం ఏర్పాట్లు జరుగుతుండగా వసుధార కూడా సహాయం చేస్తుంది. అప్పుడు వసుధార పరిస్థితి అర్థం కాక నువ్వు ఓకేనా వసు అని అనగా ఓకే అంటూ కొన్ని డైలాగులు చెబుతుంది వసుధార. అప్పుడు జగతి ధరణితో ఈ నిశ్చితార్థం జరగకూడదని గట్టిగా కోరుకుందాం అని అంటుంది. ఇంతలోనే సాక్షి తల్లిదండ్రులు దేవయాని ఇంటికి వస్తారు.
Read Also : Guppedantha Manasu Aug 12 Today Episode : రిషి పెళ్లి పనులు దగ్గరుండి చేస్తున్న వసు.. అయోమయంలో జగతి..?