Guppedantha Manasu Aug 12 Today Episode : తెలుగు బుల్లి తెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు ఒంటరిగా కూర్చుని ఉండగా ఇంతలో అక్కడికి రిషి వెళ్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి కోపంగా మాట్లాడుతూ ఉండగా వసు మాత్రం కూల్ గా సమాధానం ఇస్తుంది. అప్పుడు వస్తారా తన మనసులో ఉన్న మాటలను ఇండైరెక్టుగా చెబుతూ ఉంటుంది. కానీ రిషి కి వసుధర మాటలు అర్థం కావు. ఆ తర్వాత రిషి,పద అని చెప్పి వసు ని మా ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. మరొకవైపు మహేంద్ర దంపతులు రిషి ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

అప్పుడు రిషి తో పాటు వసు కూడా చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇకపై వసు ఇక్కడే ఉంటుంది అనడంతో రిషి షాక్ అవుతాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే రిషి పడుకుని ఉండగా ఇంతలోనే అక్కడికి గౌతమ్ వచ్చి రిషి ని లేవురా నేను నీతో మాట్లాడాలి. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఇంతలోనే అక్కడికి సాక్షి దేవయాని లు వస్తారు.

అప్పుడు రిషి గౌతమ్ మాటలు విన్న సాక్షి మంచి పని చేశావు రిషి నేనే వసుకి ఫోన్ చేసి వసుధారని పిలవాలి అనుకున్నాను అని అంటుంది. అప్పుడు పక్కనే ఉన్న దేవయాని ఏం మాట్లాడుతున్నావ్ సాక్షి అర్థం అవుతుందా అని అనగా నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను ఆంటీ శత్రువులు పక్కనే ఉంటే వారి ప్లాన్లు ఏంటి అనేది పసిగట్టవచ్చు అని అంటుంది సాక్షి.
Guppedantha Manasu Today Episode : చివరిసారిగా రిషిని చూడాలనుకున్న వసు.. ఆందోళనలో రిషి.
అప్పుడు గౌతమ్,రిషి మనం బయటికి వెళ్దాం పద అని అనగా ఇంతలో దేవయాని ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు రిషి అని అంటుంది. ఆ తర్వాత గుమ్మానికి గౌతమ్ తోరణాలు కడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వసుధార వచ్చి ఏమి బాధపడనట్లుగా మాట్లాడుతూ ఇంటికి పూలు తోరణాలు అలంకరిస్తూ ఉంటుంది. అప్పుడు వసూల్ ప్రవర్తన అర్థం కాక జగతి అయోమయంలో ఉంటుంది.
మరొక వైపు రిషి ఒంటరిగా ఉండగా ఇంతలో అక్కడికి మహేంద్ర వెళ్లి ఏంటిది ఆన్లైన్లో వస్తువులు తెచ్చుకోవడం ఏంటి అనగా రిషి మాత్రం ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. సాక్షి కోసం రిషి తీసుకు వచ్చిన గిఫ్ట్లను చూసి మహేంద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రిషి ఆ మాటలని లైట్గా తీసుకొని డాడ్ మీరు కాలేజీ ఎండిగా ఉండండి అని మహేంద్రతో అనగా మహేంద్ర దానికి ఒప్పుకోడు. ఇంతలోనే జగతి అక్కడికి రావడంతో జగతిని కూడా ఎండిగా ఉండమని చెప్పగా ఆ స్థానానికి తాను అర్హురాలు కాదు అని ముఖం మీద చెప్పేస్తుంది జగతి.
Read Also : Guppedantha Manasu: సాక్షి, దేవయానికి షాక్ ఇచ్చిన జగతి.. వసుపై కోపంతో రగిలిపోతున్న రిషి..?