...

Guppedantha Manasu: సాక్షి, దేవయానికి షాక్ ఇచ్చిన జగతి.. వసుపై కోపంతో రగిలిపోతున్న రిషి..?

Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మహేంద్ర జగతి ఇద్దరు రిషి విషయం గురించి తెలుసుకొని బాధపడుతూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో మహేంద్ర దంపతులు రిషి ఆలోచనా గురించి చర్చించుకుంటూ బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగతి మనమిద్దరం దగ్గరగా ఉండటం వల్ల రిషి మీకు దూరంగా ఉంటున్నాడేమో, ఈ విషయంలో నాదే తప్పు అని జగతి అంటుంది. ఆ తర్వాత రిషి కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోడు ఏదైనా కూడా బాగా ఆలోచించే చేస్తాడు అని అంటుంది. ఆ తర్వాత వెంటనే మహేంద్ర రిషి ని సాక్షి ఎలా ఒప్పుకున్నాడు అంటూ అనుమానపడతాడు.

అప్పుడు జగతి ఈ పెళ్లి జరగదేమో అనిపిస్తుంది అని అనగా వెంటనే మహేంద్ర ఎంగేజ్మెంట్ కు కూడా సిద్ధమయ్యారు మరి పెళ్లి జరగదు అని ఎలా అంటున్నావు జగతి అని అంటాడు. మరొకవైపు రిషి సాక్షిని కలిసి బెదిరించే పనులు చేయడం మంచిది కాదు. నువ్వు వసుధార గురించి ఆలోచించవద్దు వసువైపు నీ దృష్టి వెళ్ళకూడదు అని అనగా వెంటనే సాక్షి ఏంటి రిషి నా గురించి మాట్లాడుతాడు అంటే ఆ వసుధార గురించి మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది.

అప్పుడు సాక్షి ఆ వసదార గురించి మాట్లాడుతున్నావ్ ఏంటి రిషి మన గురించి మాట్లాడొచ్చు కదా అని అనడంతో ఆ విషయం మాట్లాడటానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. దాంతో సాక్షి కోపంతో రగిలి పోతూ ఉంటుంది. మరొకవైపు దేవయాని తన ప్లాన్ సక్సెస్ అయినందుకు సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే దేవయాని కి సాక్షి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పడంతో అప్పుడు దేవయాని నువ్వు రిషి గురించి ఆలోచించద్దు రిషి మనసులో ఎంతమంది ఉన్నా కూడా నువ్వు ఆ విషయం గురించి పట్టించుకోవద్దు అని అంటుంది.

ఇక అదే సమయంలో జగతి దేవయాని ఫోన్ లాక్కోవడంతో దేవయాని భయపడుతున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత మీ ఇద్దరికీ ఒక విషయం చెప్పాలి అని సాక్షితో ఫోన్లో మాట్లాడుతూ రిషితో నీ పెళ్లి జరగదు అని అంటుంది. మరొకవైపు వసు, రిషి గురించి ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ ఫోన్ చేసి రిషితో మాట్లాడవచ్చు కదా అని అంటాడు. మరొకవైపు ధరణి వెచ్చి దగ్గరికి వెళ్లి సాక్షితో పెళ్లికి ఎలా ఒప్పుకున్నావు రిషి అని అనగా సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటాడు రిషి.

అప్పుడు వసూల్ రిషికి చివరిసారిగా మిమ్మల్ని చూడాలని ఉంది అని మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ వెంటనే భయపడి వసుధార రూమ్ కి వెళ్తాడు. అక్కడ వసుధార లేకపోయేసరికి కంగారు పడతాడు. కానీ వసు ఒకచోట కూర్చుని ఆకాశం వైపు చూస్తూ రిసీవ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి వచ్చిన రిషి వసుధార అని గట్టిగా అరిచి ఏం మెసేజ్లు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు.అప్పుడు వసు మాత్రం రిషి ని కూల్ చేస్తూ కూల్ గా సమాధానం ఇస్తుంది.