Bindhu Madhavi : బిందుమాధవి పై నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బిందు ఫాదర్.. ఏమన్నారంటే?

Bindhu Madhavi
Bindhu Madhavi

Bindhu Madhavi : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా నటరాజ్ మాస్టర్,బిందుమాధవి మధ్య చోటు చేసుకున్న గొడవల గురించి మనకు తెలిసిందే. బిందు మాధవి ఎలాంటి గేమ్ ఆడకుండా సోషల్ మీడియాలో పిఆర్ టీం మెయింటెన్ చేయిస్తూ భారీగా డబ్బులు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకొని ఫైనల్ వరకు వెళ్లి టైటిల్ గెలుచుకుంది అంటూ ఈయన బిందుమాధవి గురించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అదేవిధంగా హౌస్ లో ఉన్న సమయంలో బిందుమాధవి పెంపకం సరిగాలేదని ఆయన తండ్రి పై నటరాజ్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bindhu Madhavi
Bindhu Madhavi

ఈ క్రమంలోనే నటరాజ్ మాస్టర్ బిందుమాధవి తండ్రి గురించి ప్రస్తావించడం వల్లనే ఫైనల్స్ కి వెళ్లాల్సిన ఈయన చివరి వారంలో ఎలిమినేట్ అయి బయటకు వచ్చారు.ఇకపోతే బిందుమాధవి గురించి నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బిందుమాధవి తండ్రి స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందుమాధవి గురించి నటరాజ్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం వాస్తవం లేదని కొట్టిపారేశారు.తన కూతురు ఎవరికీ డబ్బులు ఇచ్చి ఎవరిని మెయింటెన్ చేయిస్తూ దొంగ ఓట్లు వేయించుకోలేదని తను ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకుందని, అందుకే తన కూతురు విన్ అయిందని వెల్లడించారు.

Advertisement

ఇక నటరాజ్ మాస్టర్ అంటే ఏంటో ఈ ప్రపంచం మొత్తం చూసిందని,ఆయన హౌస్ లో ఉన్నప్పుడు అందరితో ఎలా ప్రవర్తించారో ప్రతి ఒక్కరికి తెలుసని బిందుమాధవి తండ్రి నటరాజ్ మాస్టర్ గురించి కామెంట్స్ చేశారు. ఇకపోతే నటరాజ్ మాస్టర్ బిగ్ బాస్ ఫైనల్ కి వచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి నేను తప్పుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండి అంటూ క్షమాపణలు కోరాడని ఈ సందర్భంగా బిందుమాధవి తండ్రి నటరాజ్ మాస్టర్ గురించి తెలియ చేయడమే కాకుండా బిందుమాధవి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని వెల్లడించారు.

Bindhu Madhavi: బిందు మాధవిని సపోర్ట్ చేస్తున్న తమిళ హీరో.. ఇద్దరి మధ్య మళ్లీ మొదలైన ప్రేమ వ్యవహారం..!

Advertisement