Biggboss 6 Telugu : బిగ్‌బాస్‌లో ఏమైనా జరగొచ్చు.. ఎవరు ఉంటారో.. ఎవరు వెళ్లిపోతారో ఊహించడం కష్టమే. ఈ వారం వెళ్లిపోతారులే అనుకున్న వారు ఉంటారు.. ఉంటారులే అనుకున్న వాళ్లే వెంటనే వెళ్లిపోతుంటారు. బిగ్ బాస్ ఇచ్చే ట్విస్ట్‌లు ఎవరికి అర్థం కావులే.. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి పింకీ సుదీప బయటకు వెళ్లిపోయిందని తెలిసింది. వాస్తవానికి సుదీప ఎప్పుడో ఇంట్లో నుంచి వెళ్లాల్సింది. కానీ, ఇన్నాళ్లు వంటలక్కను బిగ్ బాస్ బాగానే భరించారు. ఇక హౌస్‌లో ఉంచుకుని లాభం లేదులే అనుకున్నారేమో సుదీప ప్యాక్ యువర్ బ్యాగ్స్ అనేశారు. తట్టాబుట్టా చదురుకుని సుదీప బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయిందంటూ లీక్ వీరులు ప్రచారం చేస్తున్నారు.
Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House
నువ్వు నాకు నచ్చావ్ మూవీలో పింకీగా సుపరిచితమైన సుదీప.. అంతగా హౌస్‌లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ కారణంగానే ఈ వారం సుదీపకు ఓటింగ్ చాలా తక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. అసలు రెండు వారాల క్రితమే సుదీప బయటకు వెళ్లిపోయేది. కానీ, బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చారు. అందులో సుదీప టాస్కుల్లో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వంటలక్కగా హౌస్‌లో అందరిని మెప్పించిన సుదీప.. ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Biggboss 6 Telugu : పింకీ ప్యాక్ యువర్ బ్యాగ్స్..
Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House
ఇప్పటివరకూ బిగ్ హౌస్ నుంచి అభినయ శ్రీ, షాని, నేహా చౌదరి, ఆరోహి, చంటి ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక ఆరో వారం కూడా హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యేది బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు. ఈ వారం నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కీర్తి, సుదీప, గీతూ, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాన్, శ్రీసత్య, రాజ్, మెరీనా ఉన్నారు. వీరిలో శ్రీహాన్ 20 శాతం ఓట్లు వచ్చాయట..
ఇక ఆది రెడ్డికి 13 శాతం, శ్రీ సత్య, బాలాదిత్య, రాజ్, గీతూ 10 శాతం మేర ఓట్లు వచ్చాయట.. మరీనా 11 శాతంగా ఓట్లు వచ్చాయని లీక్ సమాచారం. ఓటింగ్ ప్రకారం చూస్తే.. శ్రీహాన్, శ్రీసత్య, గీతూ రాయల్ ఆది రెడ్డి సేఫ్ అయ్యారట.. రాజ శేఖర్, కీర్తి కూడా సేఫ్ అయినట్టు తెలిసింది. అందరికన్నా అతి తక్కువగా సుదీప 9.5 శాతం ఓట్లతోనే సరిపెట్టుకుందంట.. సుదీప డేంజర్ జోన్ లోకి వెళ్లడంతోనే ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది.
Biggboss 6 Telugu Sudeepa Eleminated This Week From House
వాస్తవానికి హౌస్ లోకి వెళ్లిన దగ్గరనుంచి సుదీప ఇంటిలో కిచెన్ దగ్గరే ఎక్కువగా హడావిడి చేసింది. వంటగదికే ఎక్కువగా రేషన్ మేనేజర్‌గా హౌస్ మేట్లను బాగా ఆకట్టుకుంది. ఇంటిలోని వారందరికి రుచికరమైన భోజనం పెట్టి బిగ్ బాస్ వంటలక్కగా పేరు సంపాదించుకుంది. టాస్కుల్లో మాత్రం సుదీప ఆకట్టుకోలేకపోయింది. అదే సుదీపకు బాగా మైనస్ అంటున్నారు నెటిజన్లు.
ఈ ఆరో వారంలో ఎవరూ ఊహించిన విధంగా సుదీప హౌస్ నుంచి ఎలిమినేట్ అయిందనే వార్తలతో ఫ్యామిలీ ఆడియెన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పింకిగా హౌస్‌లోకి వెళ్లిన సుదీప.. వంటలక్కగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఏదిఏమైనా.. బయటకు వచ్చేసిన సుదీప హౌస్ లో జరిగే విషయాలపై ఎలాంటి సీక్రెట్లను బయటపెడుతారో చూడాల్సిందే..
Read Also : Keerthi Suresh : కీర్తి సురేశ్ కిర్రాక్ డ్యాన్స్ చూశారా? పంచకట్టుతో పిచ్చెక్కించిన కళావతి.. వైరల్ వీడియో!
Read Also : TS Group -1 Exam : నెలరోజుల పసిబిడ్డతో గ్రూప్ పరీక్షకు తల్లి.. పరీక్ష రాస్తుంటే.. ఆకలితో పాప కేకలు..!