TS Group -1 Exam : పుట్టిన శిశువు మొదటిసారి తల్లి స్వర్శ తగలగానే ఆనందంతో కేరింతలు కొడుతుంది. అలాగే తల్లి కూడా శిశువు కొంచెం ఏడ్చినా తట్టుకోలేదు. అమ్మ ప్రేమంటే అదే.. అందులోనూ నెల రోజుల పసిపాపను విడిచి దూరంగా ఏ తల్లి కూడా ఉండలేదు. కానీ, కొన్ని పరిస్థితుల్లో అలా ఉండాల్సి వచ్చినప్పుడు ఆ తల్లి పడే ఆవేదన అంతా ఇంతా కాదు.. ఇప్పుడు అలాంటి సంఘటన ఒక జరిగింది.

TS Group -1 Exam _ Mother Writes Group 1 Exam with 45 Days Of Baby Girl In Warangal
నెల రోజుల పాపతో ఓ తల్లి గ్రూప్ -1 పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చింది. వరంగల్ ఏఎస్ఎం కాలేజీలో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం హుస్నాబాద్ సుమలత రాసేందుకు వచ్చింది. సుమలత నెల రోజుల కిందట ఆడపిల్లకు జన్మనిచ్చింది. కెరీర్ ఒకవైపు.. మరోవైపు తల్లి ప్రేమ.. ఈ రెండింటి మధ్య ఆ తల్లి పడిన వేదన వర్ణాతీతం.. ఎలాగైనా గ్రూపు పరీక్ష రాయాలనే ఆశయంతో పాటు ఒక తల్లిగా పసిపాపను విడిచి ఉండలేకపోయింది.
TS Group -1 Exam : కెరీర్ ఒకవైపు.. మరోవైపు తల్లి ప్రేమ..
ఏమాత్రం ఆలస్యం చేయకుండానే రెండింటి బ్యాలెన్స్ చేస్తూ ఆ తల్లి గ్రూపు పరీక్ష రాసేందుకు వచ్చింది. తల్లి లోపల గ్రూపు పరీక్ష రాస్తుండగా.. బయట తండ్రి ఆ పసిపాపను ఎత్తుకుని ఆడించే ప్రయత్నం చేశాడు. పాల కోసం ఒక్కసారిగా తల్లి ఏడ్వడంతో ఆ తండ్రి ఆపలేకపోయాడు.
ఏం చేయాలో తెలియక అధికారుల వద్దకు వెళ్లి తల్లిపాలు ఆ పసిపాపకు ఇచ్చేందుకు అనుమతించాలని కోరాడు. అధికారులు అందుకు నిరాకరించడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఆ తండ్రి పసిపాపకు డబ్బా పాలు పెడుతూ పాపను ఆడించడం ప్రతిఒక్కరిని కదిలించింది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also : Biggboss 6 Telugu : బిగ్‌బాస్ వంటలక్క అవుట్.. సుదీపను బయటకు గెంటేశారా? షాకింగ్ ట్విస్ట్ ఇదే..!