...

Teenmar mallanna: తీన్మార్ మల్లన్నలో ఊహించని మార్పు.. కేసీఆర్ ను ఒక్కమాట కూడా తిట్టడంట!

Teenmar mallanna: తీన్మార్ మల్లన్న.. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ బులెటిన్ లో ఒక పాత్ర. ఆ పాత్రతో ఎంతో మందికి చేరువయ్యాడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తెలంగాణ మూమెంట్ లో తీన్మార్ మల్లన్నకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తీన్మార్ మల్లన్న పేరు వినగానే ధూంధాం స్టేజిలు దద్దరిల్లిపోయేవి. చాలా మంది తీన్మార్ మల్లన్న అంటే లైక్ చేసే వారు. అదే ఊపులో రాజకీయాల్లోకి దిగాడు నవీన్. కానీ జనం ఆదరించలేదు. తిరిగి మళ్లీ వార్త ఛానల్లోకి వెళ్లాడు.

ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి సీఎం కేసీఆర్ ను లక్ష్యం చేసుకున్నాడు. ఏ చిన్న సందర్భం దొరికినా పచ్చి బూతులు తిట్టేవాడు. అటు కేసీఆర్ ను ఇటు కేటీఆర్ ను చీల్చి చెండాడేవాడు. ఆఖరికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కేసీఆర్ మనవడిని కూడా వదల్లేదు తీన్మార్ మల్లన్న. కేటీఆర్ కొడుకును కూడా బాడీ షేమింగ్ చేస్తూ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్నపై పలు కేసులు నమోదయ్యాయి.

కొన్ని రోజులు జైలుకు కూడా వెళ్లాడు. అయినా తీరు మారలేదు. తిట్టడం ఆపలేదు. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన మల్లన్న.. కొన్ని రోజులయ్యాక పార్టీ నుండ బయటకు వచ్చేశాడు. ఇప్పుడు తాజాగా ఇక కేసీఆర్ ను పల్లెత్తు మాట అనబోనని ప్రకటించాడు. తన ఆస్తులన్నీ ప్రభుత్వానికి రాసిచ్చి జూన్ 2 నుండి పాదయాత్ర ప్రారంభిస్తానన్నాడు. 7200 మూమెంట్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి దోపిడీ రాజ్యం పోయి ప్రజా ప్రభుత్వం ఏర్పడేదాకా పోరాటం చేస్తానని తెలిపాడు.