Comedian Sudhakar : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా సుమారు 600 పైగా సినిమాలలో నటించిన కమెడియన్ సుధాకర్ గురించి అందరికీ సుపరిచితమే. అయితే ఈయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మాత్రమే మనకు పరిచయమయ్యారు.
అయితే ఈయన కమెడియన్ కాకముందు తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కమెడియన్ సుధాకర్ చిరంజీవి ఇద్దరు క్లాస్మేట్స్ అయినప్పటికీ సుధాకర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
సుధాకర్ కేవలం మూడు సంవత్సరాలలో 45 తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయనను కొందరు ఓర్వలేక ఇండస్ట్రీలో అణిచివేశారని పెద్ద వార్తలు వచ్చాయి. ఇలా తమిళ ఇండస్ట్రీలో ఈయనకు అవకాశాలు లేకుండా తొక్కేయడంతో తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అయితే ఇక్కడ హీరోగా కాకుండా కమెడియన్ గా స్థిరపడ్డారు.ఇలా తెలుగులో సుమారు 600కు పైగా సినిమాలలో కమెడియన్ గా నటించిన ఈయన ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
తమిళ ఇండస్ట్రీలో కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈయన ఎదుగుదల చూడలేక తొక్కేశారు లేకపోతే ప్రస్తుతం సుధాకర్ కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నా గొప్ప స్థాయిలో ఉండే వారిని చెప్పాలి.ఈ విధంగా ఈయనని తమిళ ఇండస్ట్రీలో అణిచి వేయడంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు.
ఇక్కడ మాత్రం కమెడియన్ గా మాత్రమే ఈయన గుర్తింపు పొందారు. ఇక ప్రస్తుతం అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో ఈయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రేంజ్ కి వెళ్లాల్సిన సుధాకర్ కొందరి స్వార్థానికి బలై తనని ఇండస్ట్రీలో ఎదగకుండా కేవలం కమెడియన్ గా మాత్రమే పరిమితం చేశారని చెప్పాలి.