Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat Passes Away: నటుడు ప్రదీప్ రావత్ మంగళవారం (ఆగస్టు 4) తుదిశ్వాస విడిచారు. 'సై' చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రతో గుర్తింపు పొందిన ఆయన తెలుగు సహా పలు భాషల్లో విలన్, సహాయ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

By Ramesh Babu

Published on: August 4, 2026 11:28 PM

Updated on: August 4, 2026 11:28 PM

Pradeep Rawat Passes Away

---Advertisement---

Pradeep Rawat Passes Away : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ ఇకలేరు. మంగళవారం రాత్రి (ఆగస్టు 4) ఆయన కన్నుమూశారు. తనదైన విలనిజం, గంభీరమైన నటనతో ఆకట్టుకున్న ప్రదీప్ రావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ‘సై’ చిత్రంలోని భిక్షు యాదవ్ పాత్రతో చిరస్థాయిగా గుర్తుండిపోయారు. ఆయన మరణం సినీ వర్గాల్లో దిగ్భ్రాంతి నెలకొంది. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

భిక్షు యాదవ్ పాత్రతో ప్రత్యేక గుర్తింపు :

తెలుగు సినీ పరిశ్రమలో ప్రదీప్ రావత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా ‘సై’ సినిమాలో భిక్షు యాదవ్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకుంది. ఆ రోల్ టాలీవుడ్‌లో బలమైన ముద్ర వేసింది.

ఆ తర్వాత కూడా వరుసగా పలు సక్సెస్ ఫుల్ మూవీల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ప్రదీప్ మృతి వార్త తెలిసిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. విలన్ పాత్రలకు తనదైన శైలి, గంభీరమైన హావభావాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ అభిమానుల్లో ప్రదీప్ రావత్‌కు ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

Read Also : Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

‘సై’ నుంచి ‘గజిని’ వరకు :

‘సై’ మూవీ తర్వాత ప్రదీప్ రావత్ అనేక మూవీల్లో నటించారు. ఛత్రపతి, దేశముదురు, గజిని, స్టాలిన్, అందరివాడు, నేను శైలజ వంటి మూవీలో విలన్ రోల్ చేశారు. గెస్ట్ రోల్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రతి పాత్రకు ప్రత్యేకత గుర్తింపు తీసుకొచ్చారు. తెలుగు చిత్రసీమలో గుర్తుండిపోయే నటుడిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.

తెలుగు భాషతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ అనేక మూవీల్లో ఆయన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక భాషల్లో తనదైన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ప్రదీప్ రావత్ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటుగా చెప్పవచ్చు. ప్రదీప్ రావత్ మరణంపై సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.