Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026: శ్రావణ మాసంలోని మొదటి మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అఖండమైన అదృష్టం, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ వ్రతాన్ని పాటిస్తారు. ఈ వ్రతం పూర్తి పూజా విధానం, శుభ సమయాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

By Ramesh Babu

Published on: August 4, 2026 8:06 AM

Updated on: August 4, 2026 8:06 AM

Mangala Gauri Vratham 2026

---Advertisement---

  • అఖండ సౌభాగ్యం కోసం నేడు మంగళ గౌరీ వ్రతం
  • వివాహితలు తప్పక తెలుసుకోవాల్సిన పూజా విధానం
  • శ్రావణ తొలి మంగళవారం ప్రత్యేకత.. శుభ సమయం ఇదే

Mangala Gauri Vratham 2026 : మంగళ గౌరీ వ్రతం.. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం ఆచరించే మంగళ గౌరీ వ్రతానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక విధానం ఉంది. అఖండ సౌభాగ్యం, సుఖసంతోషాలతో వైవాహిక జీవితం కోసం వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తుంటారు. మంచి వరుడు దొరకాలని కోరుకునే పెళ్లికాని యువతులు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళ గౌరీగా పూజించే పార్వతీ దేవి, శివుడిని భర్తగా పొందేందుకు కఠిన తపస్సు చేసింది.

అందుకే మంగళ గౌరీ వ్రతంగా ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. వ్రతం రోజున ఉదయం స్నానం చేయాలి. ఇంటిని శుభ్రపరుచుకుని గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత అమ్మవారికి పసుపు, కుమ, పూలు, పండ్లు, నైవేద్యాలతో పూజించాలి. అనంతరం మంగళ గౌరీ వ్రత కథను శ్రద్ధగా వినాలి. అనంతరం హారతి ఇవ్వాలి. కుటుంబ సభ్యుల క్షేమం, సౌభాగ్యం కోసం ఈరోజున గౌరీ దేవీని ప్రార్థిస్తారు. ఈ ఏడాది వ్రతం పంచక, భద్ర వంటి యోగాల మధ్య వస్తుంది. పూజను శుభ ముహూర్తంలోనే చేయడం ఎంతో శ్రేయస్కరమని మహా పండితులు చెబుతున్నారు.

Advertisement

మంగళ గౌరీ ఉపవాసం :

పంచాంగం ప్రకారం.. భద్ర నక్షత్రం రాత్రి 10:03 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5:45 గంటల వరకు ఉంటుంది. అదే సమయంలో, రాహుకాలం మధ్యాహ్నం 3:49 గంటల నుంచి సాయంత్రం 5:29 గంటల వరకు ఉంటుంది. ఇది అశుభ సమయం.

మంగళ గౌరీ పూజకు సరైన సమయం :
పంచాంగం ప్రకారం.. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:20 నుంచి 5:02 వరకు ఉంటుంది. అదే సమయంలో పూజ కొరకు అభిజిత్ ముహూర్తం, మధ్యాహ్నం 12 నుంచి 12:54 వరకు ఉంటుంది. కేవలం 54 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంతేకాదు.. సంధ్యా సమయంలో పూజ సమయం సాయంత్రం 7:10 నుంచి 7:31 వరకు ఉంటుంది. అమృత కాలం సాయంత్రం 7:30 నుంచి 9:06 వరకు ఉంటుంది.

Mangala Gauri Vratham 2026 : మంగళ గౌరీని పూజించే విధానం :

  • భక్తులు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి.
  • స్నానం చేశాక శుభ్రమైన ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించాలి.
  • ఇంట్లో దేవుడి గుడి మీద ఎర్రటి వస్త్రాన్ని పరచండి.
  • గౌరీ మాత, శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించండి.
  • గౌరీకి అక్షింతలు, కుంకుమ, ఎర్రని పువ్వులు, అలంకరణ సామాగ్రిని సమర్పించాలి.
  • అమ్మవారికి పండ్లు, స్వీట్లు, పంచామృతం సమర్పించాలి.
  • మంగళ గౌరీ ఉపవాస కథను చదవండి.
  • ఓం గౌరియాయై నమః లేదా ఓం పార్వత్యై నమః అనే మంత్రాన్ని జపించాలి.
  • అమ్మవారికి హారతి ఇవ్వాలి.

16 పదార్థాల సంప్రదాయం :
భక్తులు మతవిశ్వాసం ప్రకారం.. ఈ మంగళ గౌరి ఉపవాసంలో పూజ కోసం పదహారు వస్తువులను సమర్పిస్తారు. అందులో 16 గాజులు, 16 లవంగాలు, 16 యాలకులు, 16 రకాల నైవేద్యాలు ఉంటాయి. ఈ వస్తువులను అమ్మవారికి సమర్పించే ప్రత్యేక సంప్రదాయం ఉంది. ఈ రోజున గౌరీ దేవిని పూజించడం వల్ల జాతక దోషాలు తొలగిపోయి, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వసిస్తారు.

మంగళ గౌరీ వ్రత హారతి శ్లోకం :

జయ మంగళం నిత్య శుభ మంగళం
మంగళ గౌరీ దేవికి జయ మంగళం
శంకరుని ప్రియ సతికి శుభ మంగళం
సర్వ మంగళ దాయినికి జయ మంగళం॥

Advertisement

పసుపు కుంకుమలతో పూజలందుకొనే
భక్తుల కోర్కెలన్నీ తీర్చే తల్లికి
అఖండ సౌభాగ్యములు ప్రసాదించు అమ్మకు
మంగళ గౌరీ దేవికి జయ మంగళం॥

కైలాస నివాసినికి కరుణామయికి
కష్టాలను తొలగించే జగదాంబికకు
సిరి సంపదలిచ్చే శివకామేశ్వరికి
మంగళ గౌరీ దేవికి జయ మంగళం॥

సర్వ మంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే ॥

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.