Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Venus Transit Alert : జాగ్రత్త! ఈ రాశులవారికి డబ్బు, ఉద్యోగంలో పెద్ద చిక్కులు.. అంతా కష్టకాలమే..!

Venus Transit Alert: శుక్రుడి నక్షత్ర మార్పుతో మేష, మీన రాశులవారికి డబ్బు, ఉద్యోగం, కుటుంబ సమస్యలు తప్పవని జ్యోతిష్యుల హెచ్చరిక.. పూర్తి వివరాలు తెలుసుకోండి.

By Ramesh Babu

Published on: September 12, 2026 6:00 AM

Updated on: September 12, 2026 6:00 AM

Venus Transit Alert

---Advertisement---

  • శుక్ర గోచారంతో తలకిందులయ్యే రెండు రాశుల జాతకం
  • మేష, మీన రాశులవారు అలర్ట్.. రాబోయే రోజులు కఠినం
  • గ్రహ మార్పుతో బంధాలు, డబ్బు రెండూ దెబ్బతినే రాశులివే

Venus Transit Alert : గ్రహాల గమనంలో వచ్చే చిన్న మార్పు కూడా జాతకచక్రంపై పెద్ద ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతారు. ఇప్పుడు శుక్రుడు తన నక్షత్రాన్ని మార్చుకోబోతున్నాడు, ఈ పరిణామం రెండు రాశులవారిపై నేరుగా ప్రభావం చూపనుందని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మిగతా రాశులతో పోలిస్తే ఈ రెండు రాశులవారు కొంచెం ఎక్కువ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు.

గ్రహాలు ఎప్పటికప్పుడు తమ స్థానాలను మారుస్తూ ఉంటాయని, ఈ మార్పు కొన్నిసార్లు అనుకూలంగా, మరికొన్నిసార్లు ప్రతికూలంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు వివరిస్తున్నారు. అయితే ప్రస్తుత శుక్ర గోచార ఫలితం మాత్రం అందరికీ ఒకేలా ఉండదని, నిర్దిష్టంగా రెండు రాశులవారికి ఇబ్బందికర పరిణామాలు ఎదురుకావొచ్చని వారు అంటున్నారు.

Advertisement

మేష రాశివారికి ఆటంకాలే ఆటంకాలు

మేష రాశి జాతకులు మొదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగ అవకాశాలు కూడా చేజారిపోయే సూచనలు కనిపిస్తున్నాయి, దీనికి తోడు ఆర్థికంగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఊహించని పరిణామాలు జీవితంలో మార్పులు తీసుకురావొచ్చని, సన్నిహితులు కూడా దూరమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు.

మీన రాశివారికి ఆర్థిక, కుటుంబ సమస్యలు

మీన రాశి జాతకుల విషయానికొస్తే, అప్పుల భారం పెరిగే అవకాశం ఉందని అంచనా. దంపతుల మధ్య చిన్నచిన్న విషయాలకే గొడవలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు వాయిదా పడొచ్చు, దీనివల్ల కుటుంబంలో ఒత్తిడి పెరిగే పరిస్థితి ఏర్పడొచ్చు.

Read Also : Bigg Boss Telugu 10 : యూట్యూబర్ నందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ..? బిగ్ బాస్ టీమ్ భారీ రెమ్యునరేషన్ ఆఫర్..!

గతంలో అప్పుగా ఇచ్చిన పెద్ద మొత్తం తిరిగి రాకపోవడంతో పాటు ఆర్థిక నష్టాలు కూడా ఎదురుకావొచ్చు. కీలక నిర్ణయాలు తీసుకునేముందు జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

Advertisement

ఈ కాలంలో రెండు రాశులవారు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉంటూ, ఆర్థిక వ్యవహారాల్లో అదనపు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Note : ఇందులో పేర్కొన్న అంశాలు పూర్తిగా మత విశ్వాసాలు, జ్యోతిష్య పండితుల అభిప్రాయాలపై ఆధారపడినవి మాత్రమే. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తి కోసం మాత్రమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. Tufan9 Telugu News దీనిని ధృవీకరించడం లేదు.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.