Crime News: భార్య, అత్తింటి వారి వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య..!

Crime News: పెళ్లి జరిగిన తర్వాత అమ్మాయిలు అత్తవారింటికి వేధింపులు భరించలేక చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ప్రతి విషయంలోనూ పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఈ వేధింపుల విషయంలో కూడా మగవారితో సమానంగా ఈ మధ్యకాలంలో భార్యలు,భర్తలను వేధింపులకు గురి చేస్తున్నారు. కొంతమంది పురుషులు ఇంట్లో భార్య పెట్టే బాధ భరించలేక ఎక్కువ సమయం బయటే ఉంటారు. మరి కొంతమంది భర్తలు మాత్రం మౌనంగా భరిస్తూ ఉంటారు. కానీ ఇటీవల మధ్యప్రదేశ్ లో ఇలాంటి బాధాకర సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే… మధ్యప్రదేశ్లోని ధార్ పట్టణానికి చెందిన దీపక్, టీనా భార్యా భర్తలు. దీపక్ స్థానికంగా ఓ వేర్‌హౌస్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. వీరిద్దరికీ పెళ్లైన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత బ్రహ్మంగా టీనా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది.బట్ట తెచ్చే జీతం డబ్బులు గురించి ఆలోచించే కానీ ఆలనా పాలన గురించి అసలు పట్టించుకునేది కాదు. భర్త జీతం తీసుకురాగానే డబ్బులు మొత్తం తీసుకొని తన పుట్టింటికి పంపించేది. కొంతకాలం ఓపికగా ఉన్న దీపక్ కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ భార్యను ప్రశ్నించాడు. దీంతో టీనా తన అన్న,తమ్ముళ్ళను పిలిపించి దీపక్ ని బాగా కొట్టి హింసించేవారు.

ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన దీపక్ మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన భార్య పెట్టే నరకం భరించలేక తను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా దీపక్ జేబులో సూసైడ్ నోట్ లభ్యం అయింది. ఈ ఘటన గురించి పోలీసులు విచారణ జరపగా దీపక్ సోదరుడు భార్య హింసించడం వల్ల తన తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపక్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీపక్ సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దీపక్ భార్య ని, ఆమె అన్నదమ్ములను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel