Nirmala Sitaraman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత రెండ్రోజులుగా వరుసగా రాష్ట్రంలో పర్యటిస్తున్న ఆమె తాజాగా బీజేపీ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించారు. కేంద్రం వాటా ఉన్న ప్రతి పథకానికి కేంద్రం పేరు పెట్టాలని అన్నారు. రాష్ట్రం వాటా ఇచ్చిన వెంటనే కేంద్రం వాటాలు విడదలు చేస్తున్నామని తెలిపారు. నేను అడిగిన ప్రశ్నలకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పలేదని గుర్తు చేశారు.
అందుకే అరగంటలో సమాచారం తెలుసుకొని చెప్పాలని కోరినట్లు మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. వ్యంగ్యంగా, వెటకారంగా మాటాల్డితే ఎలా సమాధానం ఇవ్వాలో తనకు బాగా తెలుసన్నారు. అప్పులు తీసుకొచ్చి చేసే పనులు ఆలస్యం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదన్నారు. అలాగే 2021 సంవత్సరం వరకు తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని ప్రశ్నించారు. మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పల పాలు చేసిందని ఆరోపించారు.
ఓ వైపు మంత్రి కేటీఆర్ వ్యగ్యంగా ట్వీట్లు చేస్తున్నారని, ఇంకోవైపు మంత్రి హరీష్ రావు కూడా పూర్తిగా విషయం తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. తనతో వ్యంగ్యంగా మాట్లాడితే ఎలా సమాధానం చెప్పాలో తనకు తెలసంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కామెంట్లు చేశారు.