...

Telangana: తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయంటే..?!

Telangana: తెలంగాణలో కొన్నాళ్లుగా రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. ఈ మధ్యే బీజేపీ పార్టీ అగ్ర నాయకత్వం హైదరాబాద్ కు వచ్చి రెండ్రోజుల పాటు సమావేశాలు నిర్వహించి… చెప్పకనే చెప్పినట్లు ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సహా హేమా హేమీలంతా తెలంగాణకు వచ్చారు.

హైదరాబాద్ లో పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్లంతా రాష్ట్రమంతా చుట్టి వచ్చారు. రాష్ట్రంలోని నాయకులను, పార్టీ కేడర్ ను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కూడా బీజేపీకి ధీటుగానే బదులిచ్చింది. కమలం పార్టీ నేతలు మాట్లాడిన మాటలకు, చేసిన విమర్శలకు అంతే పదునుగా సమాధానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎక్కడా తక్కువ కాదు అన్న ధోరణిలో ఇరు పార్టీలపై విమర్శలు గుప్పించారు హస్తం నాయకులు.

అయితే రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనేది నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని ఉంటుంది. ఆరా పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ మస్తాన్ దీనిపై కామెంట్స్ చేశాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అధికార పార్టీ టీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు సీట్లు వస్తాయని చెప్పాడు. టీఆర్ఎస్ కు 38.88 శాతం ఓట్లు వస్తాయని వెల్లడించాడు. అలాగే బీజేపీకి 30.48 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు 23.71 శాతం వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. ఇతరులకు 6.93 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని మస్తాన్ పేర్కొన్నారు.