వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

CM KCR : గులాబీ అధినాయకుడికి గుబులు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నిఘా..?

CM KCR : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇంతకు ముందర జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార గులాబీ పార్టీపైన వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ... Read more

By Vinod Kumar

Published on: December 18, 2021 10:38 AM

Updated on: August 4, 2025 9:07 PM

CM KCR

---Advertisement---

CM KCR : తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు స్థానాలను గెలుచుకుంది. కానీ, ఇంతకు ముందర జరిగిన ఉప ఎన్నికల్లో , జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది. దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ పార్టీలో కొంత జోష్ కనబడుతోంది. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా కూడా అధికార గులాబీ పార్టీపైన వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ నియోజకవర్గాల్లోని జనం మధ్యే ఉండాలని, జనం కోసం పని చేయాలని సీఎం ఆదేశించినట్లు వినికిడి. ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు రావాల్సిన పని లేదని, అత్యవసరమైతేనే రావాలని పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనే విషయాలు తెలుసుకునేందుకుగాను సీఎం కేసీఆర్ నిఘా కూడా పెట్టారని వినికిడి. మొత్తంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు రెండేళ్ల ముందరే ప్రణాళికలను రచించుకుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఈ రెండేళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని, నిరంతరం ప్రజల మధ్య ఉండి వారి సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నిఘా ద్వారా వచ్చే సమాచారం ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయనే వాదన కూడా ఉంది. మొత్తంగా పింక్ పార్టీపైన ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా ఉంది. ఈ విషయమై పార్టీ నాయకులందరికీ ఆదేశాలు అందినట్లు సమాచారం.

Read Also : Pushpa Movie Review : తగ్గేదే లే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీ ఎలా ఉందంటే..?

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel