Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Unused Bank Accounts : కస్టమర్లకు అర్జెంట్ అలర్ట్ : వాడని బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేయకపోతే జరిగేది ఇదే!

Unused Bank Accounts : ఒక సాధారణ జనరల్ సేవింగ్స్ అకౌంట్ మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేయదు. కానీ, దానితో ఏమైనా లింక్ చేసి ఉంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. ఖాతాలో ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యం ఉంటే రుసుములు వసూలు లేదా వడ్డీ పెరుగుతూనే ఉంటే బ్యాంక్ చెల్లించని రుణంగానే పరిగణించవచ్చు.

By Ramesh Babu

Published on: February 23, 2026 12:12 AM

Updated on: February 23, 2026 12:15 AM

Unused Bank Accounts

---Advertisement---

  • మీకు వాడని పాత బ్యాంకు అకౌంట్ ఉందా?
  • జీరో లేదా సేవింగ్స్ బ్యాంకు అకౌంట్ ఇన్ యాక్టివ్ అయిందా?
  • పాత బ్యాంకు అకౌంట్ ఉందనే విషయం మర్చిపోయారా?
  • ఇన్ యాక్టివ్ బ్యాంకు అకౌంట్లతో భారీగా నష్టపోతారు

Unused Bank Accounts : మీకు బ్యాంకు అకౌంట్ ఉందా? అసలు మీకు ఎన్ని బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి? జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేశారా? మీ శాలరీ పాత బ్యాంక్ అకౌంట్ రన్నింగ్‌లో ఉందా? మీరు పాత అకౌంట్ వాడటం మానేశారా? అయితే ఇది మీకోసమే.

చాలామంది ఒక జాబ్ నుంచి మరో కొత్త జాబ్ కు వెళ్లినప్పుడు అక్కడ మళ్లీ (Unused Bank Accounts) అకౌంట్ తీసుకుంటారు. జీరో బ్యాలెన్ అకౌంట్ కొత్తది తీసుకుంటారు. లేదంటే పాత జాయింట్ బ్యాంకు అకౌంట్ వాడటం మానేస్తారు. కానీ, వాడని బ్యాంకు అకౌంట్లను క్లోజ్ చేయరు.

Advertisement

అయినా పాత బ్యాంకు అకౌంట్లలో డబ్బులు లేవు కదా ఏం కాదులే అనుకుంటారు. వాస్తవానికి ఇలాంటి మర్చిపోయిన పాత బ్యాంకు అకౌంట్లతో అనేక సమస్యలు తలెత్తాయి. సైలెంట్ గా మీ జేబు ఖాళీ చేసేస్తాయి. మీ సేవింగ్స్ కూడా నెమ్మదిగా మింగేస్తుంటాయి. అంతేకాదు మీ క్రెడిట్ స్కోర్, సేఫ్టీకి సంబంధించి రిస్క్ కూడా పెరుగుతుంది. మీరు వాడని పాత బ్యాంకు అకౌంట్లు ఉన్నాయో లేదో చెక్ చేసి వెంటనే క్లోజ్ చేసుకోండి.

Unused Bank Accounts : కనీస బ్యాలెన్స్ లేకున్నా పెనాల్టీ పడొచ్చు :

మీ బ్యాంకు అకౌంటులో కనీస బ్యాలెన్స్ లేకపోవడం అతిపెద్ద రిస్క్ అవుతుంది. బ్యాంకులు ఇందుకోసం నెలవారీ పెనాల్టీలను వసూలు చేస్తాయి. మీరు ఈ పెనాల్టీలను గమనించకపోవచ్చు.

మీ బ్యాలెన్స్ క్రమంగా తగ్గిపోతుంది. నెగటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్లిపోతుంది. ఎక్కువ కాలం లావాదేవీలు జరగకపోతే అకౌంట్ ఇన్ యాక్టివ్ లేదా డోర్ మ్యాట్ అవుతుంది. అప్పుడు మీరు ఈ బ్యాంకు అకౌంట్ తిరిగి యాక్టివ్ చేసేందుకు పదేపదే బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. చాలా పేపర్ వర్క్ కూడా ఉంటుంది.

Read Also : Gold and Silver Outlook : వచ్చే వారం భారీగా పెరగనున్న బంగారం, వెండి ధరలు.. నిపుణుల హెచ్చరిక

Advertisement

క్రెడిట్ స్కోర్, పేమెంట్ రిస్క్ :
ఒక జనరల్ సేవింగ్స్ అకౌంట్ మీ క్రెడిట్ స్కోర్‌ను నేరుగా ప్రభావితం చేయదు. కానీ, దానికి లింక్ చేసిన ఇతర ఫీచర్లపై ప్రభావం పడుతుంది. మీ బ్యాంకు అకౌంటులో ఓవర్‌డ్రాఫ్ట్ (OD) సౌకర్యం ఉండి, ఛార్జీలు లేదా వడ్డీ పెరుగుతూనే ఉంటే బ్యాంక్ దానిని ‘చెల్లించని రుణం’గా పరిగణించవచ్చు.

మీ క్రెడిట్ స్కోర్ (CIBIL)పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పాత బ్యాంకు అకౌంట్లు తరచుగా ఇన్సూరెన్స్ ప్రీమియంలు, డీమ్యాట్ అకౌంట్లు లేదా పాత ఈఎంఐలతో ముడిపడి ఉంటాయి. బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయకుండా వాటిని వదిలివేయడం వల్ల మీ చెల్లించాల్సిన ఈఎంఐలు బౌన్స్ కావచ్చు.

Unused Bank Accounts : సైబర్ మోసాల రిస్క్ ఎక్కువ :

మీరు వాడని బ్యాంకు అకౌంట్ సైబర్ నేరగాళ్లకు లక్ష్యంగా మారవచ్చు. మీ ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్‌ను మార్చి మీ పాత అకౌంట్ అప్ డేట్ చేయకపోతే అనుమానాస్పద లావాదేవీల నోటిఫికేషన్‌లను అందుకోలేరు. మీకు ఎంత తక్కువ యాక్టివ్ అకౌంట్లు ఉంటే మీ ఆర్థిక వ్యవహారాలు అంత సురక్షితంగా ఉంటాయి.

మీ అకౌంట్ క్లోజ్ చేసే ముందు ఈ పనులు తప్పక చేయండి :
మీరు మీ పాత బ్యాంకు అకౌంట్ క్లోజ్ చేయాలని నిర్ణయించుకుంటే తీసుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

స్టేట్‌మెంట్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి :

గత 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలుగా స్టేట్‌మెంట్‌లను పొందండి. పన్ను లేదా వీసా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు.

లింక్‌ను చెక్ చేయండి :
ఆ బ్యాంకు అకౌంటుకు ఆటో-డెబిట్ లేదా ప్రభుత్వ సబ్సిడీ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి.

అధికారికంగా క్లోజింగ్ :
కేవలం డబ్బును విత్ డ్రా చేయడమే సరిపోదు. బ్యాంకుకు వెళ్లి మీ అకౌంట్ క్లోజింగ్ ఫారమ్‌ను నింపి రాతపూర్వకంగా కన్ఫర్మేషన్ పొందండి. మీ డెబిట్ కార్డును పూర్తిగా ధ్వసం చేయండి. మీ చెక్‌బుక్‌ను బ్యాంకుకు అప్పగించండి.

, , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.