...

Harish Rao : వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్‌కు కలిసొచ్చేనా… కేసీఆర్ ఏం చేయబోతున్నారు? 

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సెంటిమెంట్ బలంగా వినిపిస్తోంది. అదే ఆరోగ్య శాఖను ఎవరు చేపట్టినా సరే అనేక ఇబ్బందుల పాలవుతారని, ఆ విషయాన్ని నిజం చేస్తూ ఇప్పటి వరకూ తెలంగాణ వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శాఖ ను చేపట్టిన వారంతా ఏదో రకంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

మొదటి సారిగా వైద్య శాఖ మంత్రిగా పని చేసిన తాటికొండ రాజయ్య మొదలుకుని మొన్న వైద్య మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ వరకు అందరు మంత్రులు ఇబ్బందుల పాలయ్యారు. మరి ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆ శాఖను ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావుకు అప్పగించారు. మరి మిగతా వారికి కలిసి రాని ఆరోగ్య శాఖ హరీశ్ రావుకు కలిసి వస్తుందా అని అందరూ చర్చించుకుంటున్నారు.

కేవలం తొమ్మిది నెలల కాలం పాటే ఆరోగ్య మంత్రిగా కొనసాగిన రాజయ్యను సీఎం కేసీఆర్ ఎటువంటి కారణం చెప్పకుండా భర్తరఫ్ చేశారు. ఇప్పటికీ రాజయ్యను ఎందుకు భర్తరఫ్ చేశారనే విషయం మాత్రం బయటకు తెలియలేదు. అటు తర్వాత ఆ శాఖను లక్ష్మా రెడ్డికి అప్పగించారు. కానీ లక్ష్మారెడ్డి దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్ గా చెలామణి అవుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టారు. అదే సమయంలో కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు.

అటు తర్వాత ఆ పదవిని ఈటలకు అప్పగించారు. కానీ అసైన్డ్ భూములను ఆక్రమించారనే కారణంతో ఈటల మీద కేసీఆర్ వేటు వేశారు. మరి ఇప్పుడు ఆ పదవిని ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగించారు కేసీఆర్. మరి హరీశ్ రావు ఆ పదవిలో నెట్టుకొస్తారా? లేక మిగతా వారిలాగే ఇబ్బందులపాలవుతారా? అని తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Read Also : TRS Top Place : ఆ జాబితాలో వైసీపీ కంటే ముందొచ్చిన టీడీపీ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఫస్ట్..