TRS Top Place : 2019 ఎన్నికల నుంచి ఎలాగైనా సరే అధికార వైసీపీని వెనక్కు నెట్టి తాము మొదటి స్థానంలో రావాలని ప్రయత్నిస్తున్న టీడీపీకి అన్ని విషయాల్లో ఎదురుదెబ్బే తగులుతూ వస్తోంది. కానీ ఒక్క విషయంలో మాత్రం టీడీపీకి సానుకూల ఫలితాలు వచ్చాయి. వైసీపీని వెనక్కు నెట్టి ఆ విషయంలో టీడీపీ ముందు వరుసలో నిలిచింది. అదే సమయంలో తెలంగాణలో చూసుకుంటే అధికార టీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తూ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది.
ఇంతకీ టీడీపీ మొదటి స్థానంలో వచ్చింది ఏ విషయంలో అని అందరూ ఆలోచిస్తున్నారా. టీడీపీ ఫస్ట్ వచ్చింది ఎన్నికల్లో కాదండోయ్. విరాళాల సేకరణలో. 2019–2020 వ సంవత్సరానికి 81 కోట్లను విరాళాలుగా సేకరించింన టీడీపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. అదే సమయంలో అధికార వైసీపీ కేవలం 74 కోట్లను మాత్రమే విరాళాలుగా సేకరించింది. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 89 కోట్లను విరాళాలుగా సేకరించింది. ఈ విషయాలను ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది.
దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25 ప్రాంతీయ పార్టీలు కలుపుకుని మొత్తం 803.24 కోట్ల రూపాయలను సేకరించాయి. అన్ని రాజకీయ పార్టీలకు కలిపి 445.77 కోట్ల రూపాయల విరాళాలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సమకూరాయి. ఈ విరాళాల్లో 95 శాతం వరకు ఎలక్ర్టోరల్ బాండ్ల రూపంలోనే వచ్చాయని ఏడీఆర్ పేర్కొంది.
20 వేల రూపాయలకంటే తక్కువ మొత్తంలో విరాళాలు అందించిన వ్యక్తుల వివరాలను రాజకీయ పార్టీలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వర్గాల నుంచి అత్యధికంగా తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి 89 కోట్లుగా రాగా టీడీపీకి 81 కోట్లు, వైసీపీకి 74 కోట్ల విరాళాలు అందాయి. తర్వాతి స్థానాల్లో బిజూ జనతాదళ్, డీఎంకే వంటి పార్టీలు ఉన్నాయి.
Read Also : CM KCR : ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఒక్కసారిగా వారి ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్..?