...

CM KCR : ఎన్నో ఏళ్ల నిరీక్షణ.. ఒక్కసారిగా వారి ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్..?

CM KCR : అధికార పార్టీకి చెందిన లీడర్లు కొందరు ఇటీవల టూ మచ్‌గా బీహేవ్ చేస్తున్నారు. మా పార్టీ అధికారంలో ఉంది. మేము ఏది చేసినా నడుస్తుందని రెచ్చిపోతున్నారు. తమ పలుకు బడిని ఉపయోగించుకుని ప్రభుత్వ ఆఫీసుల్లో ఇతర పనులను చక్కబెడుతున్నారు. సాధారణ కార్యకర్తకే ఇంత పలుకుబడి ఉంటే.. ఓ జిల్లా స్థాయి అధ్యక్షుడికి, రాష్ట్ర స్థాయి అధ్యక్షుడికి ఇంకెంత పలుకుబడి ఉండాలి. ఏ రాజకీయ పార్టీలో అయినా జిల్లా అధ్యక్షులకు విపరీతంగా పవర్స్ ఉంటాయి. జిల్లాలో ఒక్కో నియోజక వర్గానికి ఎమ్మెల్యే ఉంటే.. అందరు ఎమ్మెల్యేలు ఆ జిల్లా అధ్యక్షుడి మాటను గౌరవించాల్సి వస్తుంది.

ఎమ్మెల్యే ప్రజలకు, నియోజకవర్గానికి జవాబుదారీ అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనే వాడు రాష్ట్ర స్థాయి నాయకత్వం మార్గదర్శకత్వంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడానికి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సి ఉంటుంది. ఆయన చాయిస్ మేరకే జిల్లాలోని కింది స్థాయి కేడర్‌కు పదవులు దక్కే అవకాశం ఉంటుంది. అలాంటిది అధికారంలో ఉన్న గులాబీ పార్టీలో జిల్లా అధ్యక్షుల నియామకాలు ఎప్పుడు జరుగుతాయని చాలా మంది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. తీరా ఆ సమయం దగ్గర పడిందనుకునే టైంకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ వారి ఆశలపై నీళ్లు చళ్లినట్టు తెలుస్తోంది.

టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు పూర్తవ్వగా, ప్రతీ గ్రామంలో విద్యార్థి యువజన మహిళా కార్మిక తదితర 14 అనుబంధ సంఘాలను ఎన్నుకున్నారు. గతంలో లాగే ఈసారి కూడా జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా స్థానిక కమిటీలను జిల్లా అధ్యక్షులే పర్యవేక్షిస్తుండగా.. అయితే, గతానికి భిన్నంగా గులాబీ బాస్ ఆలోచన చేసినట్టు తెలుస్తోంది.

జిల్లా అధ్యక్ష పదవి స్థానంలో కో ఆర్డినేటర్ అనే పదవిని క్రియేట్ చేయనున్నట్టు సమాచారం.జిల్లా అధ్యక్షుల కంటే కో ఆర్డినేటర్ పదవి బెటరని ఆలోచనకు వచ్చారట కొందరు సీనియర్ లీడర్లు.. జిల్లా అధ్యక్ష పోస్టుతో గ్రూపు రాజకీయాలు, తగదాలు పెరిగే అవకాశం ఉందని తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

సాధారణంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎమ్మెల్యేనే లోకల్ బాస్. ఒక వేళ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగితే రాజకీయంగా సమస్యలు తలెత్తవచ్చని అభిప్రాయంతో గులాబీ బాస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం కేసీఆర్ జిల్లా అధ్యక్ష పోస్టుల నియామకానికి బ్రేక్ వేసి ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లారని తెలుస్తోంది.
Read Also : YSRCP : వరుస విజయాలున్నా.. వైసీపీకి ఆందోళనేలా..?