...

YSRCP : వరుస విజయాలున్నా.. వైసీపీకి ఆందోళనేలా..?

YSRCP : ఏపీలో అధికార పార్టీ వైసీపీని ప్రజలు బాగానే ఆదరిస్తున్నారు. కానీ ఎందుకో ఆ పార్టీని భయం వెంటాడుతోంది. వైసీపీ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ దగ్గరుండి మరీ 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇంకా రెండున్నరేళ్లు మిగిలి ఉండగానే ఎన్నికల హడావుడి కనిపిస్తోంది.

ఎమ్మెల్యేలు, మంత్రులు, సామాన్య కార్యకర్తలు సైతం ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశిలిచ్చారు. ఏపీలో ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఉపఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ విజయఢంకా మోగించింది. ప్రతిపక్షాలు మాత్రం కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి.

వైసీపీ పార్టీకి పట్టుకున్న భయం ఏంటంటే జనరల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ వేరేలా ఉంటాయని భావించినట్టు తెలుస్తోంది. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి ఉన్న సమయంలో ప్రతిపక్ష లీడర్ జయలలిత లోకల్ బాడీ ఎన్నికలను బహిష్కరించినా.. ఆ తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌లో అన్నాడీఎంకే పార్టీ గెలుపుబావుటా ఎగరేసింది.

దీని ప్రకారం లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలను పూర్తి స్థాయిలో నమ్ముకోలేమని జగన్ పార్టీకి అర్థమైనట్టు తెలుస్తోంది.నిజానికి ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలా జరిగుంటే వైసీపీ సత్తా ఏంటో తెలిసేదని అంటున్నారు విశ్లేషకులు.

ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను సంక్షేమ పథకాలకు బాగా అలవాటు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో అవే తమ పార్టీని గట్టేక్కిస్తాయని ఆ పార్టీ నేతలు ఫుల్ భరోసాతో ఉన్నారు. కానీ వాస్తవానికి ఏపీ నిండా అప్పుల్లో కూరుకుపోయింది. సంక్షేమ పథకాలకే బడ్జెట్ మొత్తం ఖర్చవుతుంది. ఇంకా అభివృద్ధికి నిధులు కావాలంటే కేంద్రాన్ని యాచించాల్సిందే. లేదా పన్నులు పెంచాల్సి ఉంటుంది.

ఒకవేళ పన్నులు పెంచితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ప్రతిపక్షాలు వీటిని కార్నర్ చేసి వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలుగుతారు. ప్రజలు అభివృద్ధిని ప్రశ్నించనంత వరకు జగన్ పార్టీ సేఫ్.. వరుస విజయాలు నమోదవుతాయి. ఒక్కసారి ప్రశ్నిస్తే జగన్ పని అయిపోయినట్టే అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇవన్నీ అంచనా వేసే వైసీపీ లీడర్లు ఆందోళనలో ఉన్నారట..
Read Also : Chandrababu Naidu : పార్టీ లైన్ క్రాస్ చేస్తున్న తెలుగు తమ్ముళ్లు.. వారిపై చర్యలు?