Viral video: గతంలో అయితే కేవలం పెళ్లి భరాత్, మెహెందీ ఫంక్షన్ లో మాత్రమే డ్యాన్సులు చేసే వాళ్లు. కానీ ఈ కాలంలో మాత్రం ఎంగేజ్ మెంట్ నుంచి అమ్మాయిని అత్తారింట్లో దించే వరకు చేసే ప్రతీ వేడుకలను స్టెప్పులు వేస్తున్నారు కేవలం స్నేహితులు, బంధువులు మాత్రమే కాదండోయ్.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా. వారు డ్యాన్సులు చేయకుండా ఈ మధ్య పెళ్లిల్లు జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అయితే తాజాగా ఓ వధువు పెళ్లి రిసిప్షన్ స్టేజీపైనే అదిరిపోయేలా స్టెప్పులు వేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అదిరిపోయేలా మాస్ స్టెప్పులు వేస్తూ… తూనీగాల తిప్పేసింది. ఇది చూసిన బంధువులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు పెళ్లి కొడుకు కూడా ఫిదా అయిపోయాడు. సంప్రదాయ పద్దతిలో అందంగా ముస్తాబైన ఆ పెళ్లి కూతురు డ్యాన్స్ మాత్రం చాలా బాగుందండోయ్. చూసేందుకు రెండు కళ్లు సరిపోవట్లేదు. మీరూ ఓ సారి ఆ డ్యాన్స్ వీడియో చూసేయండి.
https://youtu.be/FY90p7reweA