Viral dance : మాస్ స్టెప్పులతో మహిళామణుల డ్యాన్స్.. లుక్కేస్తే కిక్కే!

Viral dance : డ్యాన్స్ అంటే ఇష్ట పడే వాళ్లు ఎక్కడ కొంచెం దరువు వినిపించినా, పాట వినిపించినా స్టెప్పులు వేయకుండా ఉండలేరు. ఇక పెళ్లిళ్లు, ఏవైనా పెద్ద పెద్ద ఫంక్షన్లలో డీజేలు వంటి పెడితే అయితే ఇక వారికి చెప్పాల్సిన అవసరమే ఉండదు. వారంతట వారే వెళ్లి డ్యాన్స్ చేస్తుంటారు. మన ఎదుట ఎవరు ఉన్నారనే విషయం కూడా మర్చిపోయి మరీ స్టెప్పులు వేస్తూ అందర్నీ అలరిస్తారు. వీరు చేసే డ్యాన్స్ ముందు హీరోలు, హీరోయిన్లు కూడా బలాదూరే. అయితే తాజాగా ఓ పెళ్లిలో ఇద్దరు మహిళలు వేసిన డ్యాన్స్ వైరల్ గా మారింది.

Auntys dance video goes to viral
Auntys dance video goes to viral

ఇద్దరూ పట్టు చీరలు కట్టుకొని, అందంగా ముస్తాబై… డీజే పాటకు డ్యాన్స్ చేశారు. చాలా సేపు వారిద్దరూ స్టెప్పులు వేశారు. ఇది చూసిన వారంతా వీడియోలు తీయడం ప్రారంభించారు. అంతేనా వాళ్లు మరింత ఎక్కువగా డ్యాన్స్ చేసేలా ఎంకరేజ్ చేశారు. అయితే ఈ వీడియోని అక్కడున్న వాళ్లలో ఒకరు సోషల్ మీడియాలో పెట్టగా.. ఇది కాస్తా వైరల్ అయింది. క్షణాల్లోనే ఈ వీడియో వేలల్లో వ్యూస్ ని సంపాదించింది. నెట్టింటిని షేక్ చేస్తూ… ప్రస్తుతం మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. వారిద్దరూ చేసిన డ్యాన్స్ కు నెటిజెన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel