...

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ బైక్ మీద రెండు నంబర్ ప్లేట్లు…కేసు పెట్టండి అంటు పోస్ట్..!

RRR: దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. టాలీవుడ్ ఇద్దరు టాప్ హీరోలను ఓకే స్క్రీన్ మీద చూపించిన ఘనత ఒక రాజమౌళికే దక్కుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించగా.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాడు. అయితే ప్రతి సినిమాలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి.

టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వత చిన్న చిన్న తప్పులు కూడ బయట పడుతున్నాయి. ఇది వరకు సినిమా రిలీజ్ అయితే సినిమా చూసి వెళ్ళేవారు. కాని ఈ రోజుల్లో యువత సినిమాలు మాత్రమే చూడకుండా ప్రతి చిన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆశూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ద్వారా ఆమె కార్ నెంబర్ తెలుసుకొని కార్ మీద పెండింగ్ లో ఉన్న చలాన్ల గురించి తెలుసుకొని ఆమె పరువు తీశారు. ఇలా ప్రస్తుతం RRR సినిమాలో జరిగిన చిన్న పొరపాటు గురించి ఒక నెటిజన్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.

RRR సినిమాలో ఎన్టీఆర్ ఉపయోగించిన బైక్ కి రెండు నెంబర్ ప్లేట్లు ఉండటం గమనించిన నెటిజన్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో వేదికగా షేర్ చేస్తూ.. ఒకే బైక్ కి రెండు నంబర్ ప్లేట్లు ఎలా ఉంటాయి . డైరెక్టర్ రాజమౌళి మీద కేస్ పెట్టండంటు ఫన్నీగా హైదరాబాద్ పోలీసులను టాగ్ చేస్తూ ఫిర్యాదు చేశాడు. ఇందుకు స్పందించిన హైదరాబాద్ టీమ్ పోలీసుల ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిలో వారు కూడా ప్రాంతం, తేదీ, సమయం తెలపండి అని ఫన్నీ సింబల్స్ పెట్టి సరదాగా ట్వీట్ చేశారు. దాంతో ఈ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది.