Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

T20 WC 2026 : హార్దిక్, ఇషాన్ ఇచ్చిపడేశారు భయ్యా.. భారత్ దెబ్బకు నమీబియా చిత్తు.. సూపర్-8 బెర్తు ఖాయమే!

India vs Namibia : టీ20 ప్రపంచ కప్ 2026లో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ నమీబియాను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో భారత్ సూపర్ 8లో దాదాపు స్థానం సంపాదించుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో తలపడనుంది.

By Ramesh Babu

Published on: February 12, 2026 11:12 PM

Updated on: February 12, 2026 11:31 PM

T20 WC 2026

---Advertisement---

  • T20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అద్భుత ప్రదర్శన
  • గ్రూప్ A మ్యాచ్‌లో నమీబియాపై భారత్ 93 పరుగుల తేడాతో ఘన విజయం
  • ఇషాన్ కిషన్ అద్భుతమైన 61 పరుగులతో టీమిండియా విజయతీరాలకు
  • హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ ప్రతిభ, 28 బంతుల్లో 52 హాఫ్ సెంచరీ

T20 WC 2026 IND vs NAM : T20 ప్రపంచ కప్‌ 2026లో నమీబియాపై 93 పరుగుల తేడాతో భారత్ భారీ ఘనవిజయం సాధించింది. యూఎస్ఏ, నమీబియాలను ఓడించాక టీమీండియా సూపర్ 8లో దాదాపు బెర్త్ ఖాయం అయినట్టే. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది.

కానీ, ఆ తర్వాత 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 116 పరుగులకే చేతులేత్తేసింది. ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇషాన్ 24 బంతుల్లో 61 పరుగులు చేయగా, హార్దిక్ పాండ్యా 28 బంతుల్లో 52 పరుగులు చేసి, 2 వికెట్లు కూడా పడగొట్టారు.

Advertisement

T20 WC 2026 : భారత్ మ్యాచ్ ఎలా గెలిచిందంటే? :

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ ఓడిపోగా భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. సంజు సామ్సన్, ఇషాన్ కిషన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. సంజు సామ్సన్ 3 సిక్సర్లు, ఒక 4 కొట్టాడు. కానీ, 22 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 24 బంతుల్లో 61 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 13 బంతుల్లో 12 పరుగులు చేసి విఫలమయ్యాడు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్ ఝళిపించాడు. 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ తర్వాతి బంతికే 52 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Read Also : Income Tax Draft Rules : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త టాక్స్ రూల్స్, అన్ని పేమెంట్లకు పాన్ కార్డు మస్ట్!

అయితే, టీమీండియా మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. రింకు సింగ్ కేవలం ఒక పరుగు మాత్రమే చేయగలిగాడు. అక్షర్ పటేల్ మొదటి బంతికే ఔటయ్యాడు. శివమ్ దుబే 23 పరుగులు చేసినా బ్యాటింగ్ చేయలేకపోయాడు. నమీబియా తరఫున కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 వికెట్లు పడగొట్టాడు.

Advertisement

వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన :

భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అత్యుత్తమ ప్రదర్శనతో నిలిచాడు. స్పిన్నర్ కేవలం 12 బంతుల్లో 7 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా తలో 2 వికెట్లు పడగొట్టారు.

అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దుబే, జస్‌ప్రీత్ బుమ్రా తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో, టీమిండియా గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. దాంతో సూపర్ 8 దశకు చేరుకుంది. భారత్ తర్వాత మ్యాచ్ ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరుగుతుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కొలంబోకు వెళ్లనుంది.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.