RRR First USA Review : ఫస్ట్ USA రివ్యూ.. ‘ఆర్ఆర్ఆర్’ అసలు స్టోరీ ఇదే.. ఎమోషనల్ క్లాసిక్.. ఒక యాక్షన్ ఫీస్ట్..!

RRR First USA Review : RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film
RRR First USA Review : RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film

RRR First USA Review : ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఆర్ఆర్ఆర్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. అయితే RRR మూవీకి సంబంధించి అమెరికాలో ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది.. ఆర్ఆర్ఆర్ మూవీ స్టోరీపై అనేక విధాలుగా వినిపిస్తోంది. ఈ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించిన సంగతి తెలిసిందే.. రియల్ పాత్రలకు మూవీలోని పాత్రలకు ఏంటి సంబంధం అనేది పూర్తిగా తెలియాలంటే సినిమా ముందు అందరూ తప్పక చూడాల్సిందే.. అసలు ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళి ఏ కథాంశంతో తెరకెక్కించారో ఇప్పుడు చూద్దాం..

అదో నిజాం పరిపాలన కాలం.. తెలంగాణ రాష్ట్రంలో ఒక గిరిజన ప్రాంతంలో అసలు స్టోరీ ప్రారంభమవుతుంది. నిజాంను కలిసేందుకు వచ్చిన ఒక బ్రిటిష్ దొర గోండు పిల్లను బలవంతంగా తీసుకెళ్తాడు.. ఆ గోండు జాతి కాపరిగా కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. గోండు పిల్లను ఎత్తుకెళ్లిన విషయం కొమురం భీంకు తెలుస్తోంది. వెంటనే గూడెం పిల్ల కోసం దొరల పాలన సాగుతున్న దేశ రాజధాని ఢిల్లీలో కొమురం భీం అడుగుపెడుతాడు.

Advertisement

అక్కడ పెద్ద ఫైట్ సన్నివేశంలో ఆ గిరిజన పిల్లను రక్షిస్తాడు. ఆ కొమురం భీం (తారక్)ను పట్టుకునే బాధ్యతను సీతారామరాజు (రామ్ చరణ్)కు బ్రిటీష్ ప్రభుత్వం అప్పగిస్తుంది. రామరాజు కొమురం భీమ్‌లోని మంచితనం, నిజాయితీకి ముగ్ధుడై పోతాడు. దొరలకు అప్పగించాల్సిన కొమురం భీంకు రామరాజు సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురునిలిచినందుకు రామరాజుకు బ్రిటీష్ ప్రభుత్వం మరణ దండన విధిస్తుంది.

RRR First USA Review _ RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film
RRR First USA Review _ RRR First usa premiere Show Review Out from SS Rajamouli Film

రామరాజు ఉరికంభం ఎక్కబోతున్న విషయం కొమురం భీంకు తెలియదు.. అదే సమయంలో రామరాజు భార్య సీతను కొమురం భీం కలుసుకుంటాడు. ఆమె పెట్టిన సద్ది తింటాడు.. అనంతరం భీం సీత కష్టానికి కారణం తెలుసుకుంటాడు. మనువాడిన వాడు ఉరికంభం ఎక్కబోతున్నాడని తెలిసి సీత కన్నీరు పెట్టుకుంటుంది. అతడు రామరాజు అనే విషయం కొమురం భీంకు తెలిసిపోతుంది.

Advertisement

వెంటనే ఆగ్రహంతో ఊగిపోయిన కొమురం భీం.. నీ భర్త శ్రీరాముడు.. ఆ రాముడికి కష్టం వస్తే వెళ్లాల్సింది సీతమ్మ కాదు. ఈ లక్ష్మణుడు అంటూ కొమురం భీం (ఎన్టీఆర్) మరోసారి బ్రిటీష్‌పై దండెత్తుతాడు. ఆ క్రమంలోనే జైల్లో బంధీగా ఉన్న రామరాజును కొమురం భీం తప్పిస్తాడు. అలా మొదలైన కొమురం భీం, రామరాజుల స్నేహం చివరిలో ఎలాంటి టర్నింగ్ తిరుగుతుంది? ఇద్దరూ కలిసి బ్రిటీష్ ప్రభుత్వంపై ఎలా పోరాడుతారు అనేది ఆ తర్వాత కథ ఉంటుంది.

విశ్లేషణ :
నటి నటీనటుల్లో.. ఎన్టీఆర్ – చరణ్ నటనే ఈ మూవీలో హైలట్ అని చెప్పాలి. తారక్, చరణ్ అద్భుతంగా నటించారు. మల్టీస్టారర్ మూవీలో ఇద్దరు హీరోల అభిమానులకు ఫుల్ మీల్స్ అందినట్టే.. వీరిద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ బాగా పండాయి. వీరిద్దరి మార్గాలు ఆలోచనలు వేరు అయినా వీరి మధ్య స్నేహమనే బంధంతో జెర్నీని చాలా చక్కగా చూపించాడు రాజమౌళి.. ఇంటర్వెల్ ముందు ఇద్దరి మధ్య బిగ్ ఫైట్ జరుగుతుంది.

Advertisement

ఈ సినిమాకు ఇదే హైలట్ సీన్.. రెండు సింహాలు ఒకేసారి కలబడితే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సిల్వర్ స్ర్కిన్ పై ఈ మూవీ చూస్తే.. విజువల్స్ అదిరిపోయేలా ఉన్నాయి. వీరి ఎమోషన్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో కన్నీళ్లు ఆగవంతే.. చరణ్, ఎన్టీఆర్ ఎంత కష్టపడ్డారో బాగా కనిపిస్తుంది. ఏది ఏమైనా వీరి పెర్ఫార్మెన్స్ చూసి మెచ్చుకోకుండా ఉండలేరు.

ఇక హీరోయిన్ విషయానికి వస్తే.. అలియా భట్ సీత పాత్రలో అద్భుతంగా నటించింది. ఇతర కీ రోల్స్ చేసిన ఒలీవియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రీయా కూడా తమదైన శైలిలో అద్భుతంగా నటించారు. ఫస్ట్ హాఫ్‌లో ఎన్టీఆర్, చరణ్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి.. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడినట్టు కనిపించలేదు. అంత అద్భుతంగా వచ్చాయి.

Advertisement

ఇక రామరాజు (చరణ్), సీత (అలియా) మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. మొత్తం మీద ఈ మూవీ యూనిక్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఎమోషనల్‌గా సాగే ఈ మూవీ క్లైమాక్స్ అద్భుతమని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ మూవీలో జక్కన్న క్లైమాక్స్ సామాన్య ప్రేక్షుకుల నుంచి ఎవరూ ఊహించనంతగా తెరకెక్కించాడు. సినిమా క్లైమాక్స్ విషయంలో జక్కన్న తీసుకున్న స్టెప్ నిజంగా మెచ్చుకోవాల్సిందే.. ఏది ఏమైనా ట్రిపుల్ ఆర్ మూవీ అనేది విజువల్ గా ఒక అద్భుతమని చెప్పాలి.. అంతేకాదు.. ఎమోషనల్ పండించిన క్లాసిక్ మూవీ.. అందులోనే యాక్షన్ ఫీస్ట్ గా చెప్పవచ్చు..

Read Also : RRR First Review : ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రామ్ చరణ్ అద్భుతమైన ఫామ్.. ఎన్టీఆర్‌కు నేషనల్ అవార్డు ఖాయం.. షాకింగ్ క్లైమాక్స్ హైలట్..!

Advertisement