...

Radhe Shyam Movie Release : ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Radhe Shyam movie Release : పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ” రాధే శ్యామ్‌ “. ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యారిస్‌ బ్యాక్‌డ్రాప్‌లో కొనసాగే ప్రేమకథ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్, ప్రసీధ నిర్మించిన ఈ భారీ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కేయాలని భావించారు. అయితే ఈ ఏడాది సంక్రాంతి సినిమాలకు ఒమిక్రాన్ దెబ్బ బాగా గట్టిగానే తగిలింది.దీంతో ఈ సినిమాని వాయిదా వేయక తప్పలేదు. కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది.

కాగా ఇప్పుడు ఈ వార్తలన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు మూవీ యూనిట్. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ ప్రకటించారు. మార్చి 11న ‘రాధే శ్యామ్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల చేయనున్నట్టు ఈ రోజు ఉదయం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు. ” ప్రేమకు, విధిరాతకు మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని మార్చి 11న థియేటర్లలో చూడండి. ఆ రోజు థియేటర్లలో కలుద్దాం” అని ప్రభాస్ పేర్కొన్నారు.

Radhe Shyam Movie Release : ‘రాధే శ్యామ్’ రిలీజ్ డేట్ ఇదే..

తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ వార్తతో ప్రభాస్ అభిమానులంతా పూనకాలు ఖాయం అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా… మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు.

Read Also :  మీ ఇంట్లో ఇవి ఉంటే.. అన్నీ శుభాలే.. చేతి నిండా డబ్బు..!