Radhe Shyam: రాధేశ్యామ్ సినిమా కోసం షూటింగ్ కి డుమ్మా కొట్టి వచ్చిన తమిళ స్టార్ హీరో… కారణం అదేనా?

Radhe Shyam: రాధాకృష్ణ దర్శకత్వంలో టి సిరీస్, యు.వి క్రియేషన్స్ బ్యానర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రాధే శ్యామ్.ప్రభాస్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 11వ తేదీ ఐదు భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది.ఈ క్రమంలోనే ఇప్పటికే చిత్రబృందం ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో కూడా నిర్వహించారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఎమ్మెల్యే, హీరో ఉదయనిధి స్టాలిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఉదయనిది స్టాలిన్ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.నిజానికి ఈరోజు నాకు సినిమా షూటింగ్ ఉంది కానీ ప్రభాస్ సినిమా ఫ్రీ రిలీజ్ కోసం సినిమాకు లీవ్ పెట్టి వచ్చాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

ప్రభాస్ సినిమా కోసం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొనడం వెనక కూడా ఓ పెద్ద కారణం ఉంది.ప్రభాస్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ది కావడంతో ఈ సినిమాని ఇతర దేశాలలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాధేశ్యాం చిత్రాన్ని తమిళనాడుతో పాటు మలేషియా వంటి దేశాలలో కూడా ఉదయనిది స్టాలిన్ విడుదల చేస్తుండడం గమనార్హం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఉదయనిధి స్టాలిన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel